సబ్ ఫీచర్

‘వృథా’ను వృథా కానివ్వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవులు- సామాన్యంగా ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేది శరీర సుఖానికే. రుచికరమైన తిండి, సుఖవంతమైన నిద్ర, నచ్చిన వాటిపై కోరిక స్వంతం చేసుకోవాలనే తపన. ఇది నేడు సామాన్యంగా మానవుల జీవనంలో కనిపించే విషయాలు తిండి, గృహం, బట్ట మొదలైన వాటికై ధనం సంపాదన ఉండేవి. నిజమే శరీర నిర్వహణ తప్పనిసరిగా ద్రవ్యం అవసరం. ధనంతో నేడు అవసరాలన్నీ సమకూరుతాయి. అందుకని ధన సంపాదన అవసరం. అది ఎంత వరకో అంతవకు అయితే బాగుంటుంది. అవసరాన్ని మించే కోరికలు వాటికై ధన సంపాదన చేయడం సహజపరిణామంగా నేడు మారింది.
‘‘్ధన సంపాదనకై ధర్మ మార్గం కూడా తప్పడం జరుగుతోంది. తమకున్న వృత్తయినా, ఉద్యోగమో, వ్యాపారమో ఏదైనా న్యాయం, ధర్మం, నీతి తప్పకుండా నిర్వహించుకోకలిగితే ఎంతయినా ఆ మనిషికే మేలు జరిగేను. తను ధర్పం తప్పితే జరిగిన నష్టం ఇతరులకు తాత్కాలికమే కాని తన అజ్ఞానం అత్యాశవలన నష్టం తనకే తీవ్రస్థాయిలో ఈ జన్మలోను ఇంకా తనకంట బడకుండా తీసుకువెళ్ళడం జరుగుతుంది. మనిషిని మాయా మోహాలు నిరంతరం పట్టి ఉంటాయి. అవి తమను అభివృద్ధి నిచ్చెనల వైపు తీసుకువెళ్తూన్నట్లుగా భ్రమ చెందడం కర్మలు (పనులు) చేయడం జరుగుతుండడం మామూలే. కాని నిజానికి అథఃపాతాళానికి తీసుకువెళ్ళేవే మాయామోహాలు. తనకు చెందనిదేదైనా ఆశించడం, దక్కించుకోడానికై తాపత్రయ పడటమనేది స్వర్గమనిపించే నరక ప్రయాణం. మనిషి ధనానికే కాదు స్ర్తి, పురుషుల విషయంలో కూడా కోరికతో తమకు కాని వారిపై అడ్డదారిలో పొందాలనుకోవడం పాశవిక ప్రవృత్తి. తిండి నిద్ర సమకూరుతున్నాయని భగవంతుడు అనుగ్రహించడం వలన అవి లభించాయని గ్రహించలేక సంతృప్తి పడకుండా కోరికల వెంట పరుగులే పరుగులు. తిండి నిద్ర ఈ రెండింటికి సుఖమనే విషయాన్ని జతచేస్తూ తిండిలో రకరకాల రుచులంటూ తిరగబట్టి నేడు రకరకాల ఆహార పదార్ధాలను వండి అమ్మే సంస్థలు విపరీతంగా పుట్టుకొచ్చాయి. ఆర్జన విధానంలో స్ర్తి, పురుషులు ఇరువురూ ఉద్యోగ సద్యోగాలలో నిమగ్నమవడం వండుకునే తీరిక లేక బయట తినుబండారాలను తినడానికి జనం అలవాటు పడడంతో వీరికి అనుగుణ్యంగా అదే ఉపాధిగాను వ్యాపారంగాను, ఆహార సంస్థలు అనేకానేకం పుట్టి వృద్ధి చెందుతున్నాయి. ఆహార పదార్థాలు, పచ్చివి ఉడికినవి, సగం ఉడికినివి ఇలా వివిధ రకాలు ఉత్పత్తి అమ్మకం బజారుల్లో జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇలా అన్నీ అందుబాటులోకి రావడం జరుగుతూంటే మనిషి స్వయంగా తయారు చేసుకోవడం అదొక కష్టంగాను, సమయం వృధాగా భావించడం జరగడంతో బయట ఆహార వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతున్నాయి. అదేవిధంగా అన్నింటిలోను కల్తీలు కూడా జరుగుతున్నాయి. కల్తీ కనిపెట్టలేని రీతిలో జరగడమే విశేషం. ఆహార కల్తీ కారణం దానంతటదే ప్రజల ఆరోగ్యం పాడవడం సర్వసామాన్య విషయంగా మారుతోంది. అయినాసరే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, కొనడం, తినడం మానటం లేదు. అందుకే అంటారేమో చీడ (వ్యాపించినట్లుగా) (అబ్బినట్లుగా) సిరి అబ్బదంటారు. చెడు తొందరగా వ్యాపిస్తుందేలాగో అంత తొందరగా రూపు మాయదు కూడా!.
ఆ మధ్య చల్లటి పానీయాలలో నిల్వ ఉండటానికిగాను క్రిమి సంహారక మందులు కలుపుతున్నారన్నారు. ఎవరు త్రాగకూడదన్నారు, ఇంటికెవరన్నా వస్తే ఓ కాపీ టీలు ఇస్తామనడమే అతిధి మర్యాద. పూర్వకాలంలో ఇంటికి వచ్చిన వారికి అప్యాయంగా మర్యాదపూర్వకంగా మజ్జిగ ఇచ్చేవారు. అతిధులు అంత అప్యాయంగానే త్రాగేవారు. నేడయితే మజ్జిగ మర్యాద మడుగున పడిపోయింది. వచ్చినవారు కాఫీ, టీలు అయితే వద్దండీ అనేస్తున్నారు. చల్లటి పానీయాలు (కూల్‌డ్రింక్స్) యిస్తే వద్దనకుండా మజ్జిగలా ఆనందంగా స్వీకరిస్తున్నారు. ఇంటిలో కూడా అలసట అనిపించినా ఠక్కున కూల్‌డ్రింక్స్ త్రాగి సేద తీరుకున్నారు. పని ఎక్కువైనా తలనొప్పి, ఏ బాధో అనిపించినా ఠక్కున కూల్‌డ్రింక్స్ తాగి సేద తీర్చుకుంటున్నారు. మంచినీళ్ళు త్రాగితే సేద తీరేను శరీరం మరి అలా కాదే. అదే ఇళ్ళల్లో లేని వారయితే దుకాణాలకి వెళ్ళి త్రాగి వస్తారట. ఇంతలా అలవాటు పడిన జనం అవి మంచివికాదంటే ఎవరు మానగలరు. అలాగే నూడిల్స్ విషయంలోను కూడా జరిగేది ఇదే. చల్లటి పానీయాలు త్రాగడం, తినగడం విషయంలో వయో బేధం ఏమాత్రం ఉండదు. అన్ని వయసులవారు అన్ని వర్గాల వారు అలవాటుపడిన విషయాలు. ఒకటేమిటి కూర మసాలా పొడులు, కారం పొడులు అన్నీ బజారు నుండి తయారైనవి తెచ్చుకోవలసినదే కదా. అప్పటికప్పుడు పేకట్ ఇప్పేసి తక్షణం తయారుచేసే విధంగా దోశ, యిడ్లీ, పులిహోర వగైరాల పొట్లాటలు సర్వం సిద్ధంగా బజారులో దర్శనమిస్తున్నాయి. అందరికి తెలియడానికి గాను ప్రచార సాధనాలు ఉండనే ఉన్నాయి కదా!
ఆరోగ్యంపై వాడే బార్లీ మొదలైన పౌడర్లు కూడా పేకట్లలో దొరుకుతున్నాయి. వీటిలో నిలువ ఉండేవి కొన్ని అయితే కొన్ని నిలువ ఉండవు. బార్లీ మొదలైన కొన్ని పేకింగ్స్‌లో పురుగులు తప్పనిసరిగా చేరుతాయి. చూసుకోవడం పట్టించుకోవడం మరల దుకాణాలను నిలదీయడం ఇన్ని విషయాలు జరగడం అరుదు. చూసి బాగుంటే వాడుకోవడం లేకపోతే పారేయడం, మరల కొత్తవి కొనుక్కోవటం పరిపాటి. ఆహారం ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోవడం అందరికి అవసరం. పసి పిల్లలకయినా వృద్ధులకు ఎవరికైనా ఆహారంలో పరిశుభ్రత చాలా అత్యవసరం. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త అవసరం. ఆహారంలో పరిశుభ్రత తాజాతనం ఎంత అవసరమో ఆహార భద్రతతోపాటు ఆహారాన్ని దుర్వినియోగం చేయకుండా చూడటం అంతే అవసరం. ఇవాళ రేపు ఆహార దుర్వినియోగం కూడా బాగా ఎక్కువగానే జరుగుతోంది. ప్రతీ చిన్న విషయాన్ని ఫంక్షన్ పేరిట నలుగురు ఒకచోట సమావేశమవడం. పండుగలా జరుపుకోవడం అలవాటుగా మారింది. పండుగ ఉత్సవంలో ముఖ్య విశేషం భోజనాలు ఉండాలి కదా! ‘‘్భజనాలు ఎక్కువగా ఎవరికి వారు తీసుకు తినడం (బఫీ) రీతిలో జరుగుతుంటాయి. భోజనాల్లో ఏర్పాటుచేయబడిన పదార్థాలు చాలా ఎక్కువగా ఎక్కువ రకాలు ఉంటాయి. ‘‘ఇంటివద్ద మనిషి ఎంత ఘనభోజనం తింటూన్న మహా అయితే రెండు కూరలు, పప్పు, పులుసు, పచ్చడి, పెరుగు ఏదైనా ఒక స్వీట్, ఒక పండుతో తింటూంటారు. కొంతమంది సామాన్యంగా అయితే ఒక కూరో, చారో, పులుసో, మజ్జిగ ఆరోగ్యంగా ఇలా కూడా తింటూ ఉండవచ్చు. కాని ఇలాంటి ఫంక్షన్స్‌లో అయితే రకరకాల ఆహార పదార్ధాలు లెక్కకుమించి ఉండీ మనుషులను ఊరిస్తుంటాయి. ఇంక ఆయా ఫంక్షన్స్‌కి వెళ్లిన వారు మొగమాటానికో ఆహార పదార్ధాలు రుచిచూడాలనో, ఎలానో ఓలాగునా తినగలిగినా తినలేకపోయినా అన్నిటిని తమ పళ్ళెంలో వడ్డించుకోవడం అన్నిటిని వృధాగా పారవేయడం సర్వసామాన్యంగా జరుగుతున్న విషయం. ఎంగిలి పళ్ళెలు విస్తరింటలు చూస్తే వడ్డించుకున్న పళ్ళేల్లాగే కనబడుతూంటాయి.
నిజమే పదార్ధాలు రుచి చూడాలని అందరికి అనిపించడం సహజం. అందుకే ఏ పదార్థాం అయినా తక్కువ మోతాదులో కొద్దికొద్దిగా వడ్డించుకుని లేదా వడ్డించే వారున్నప్పుడు కొంచెం వేయమని చెప్పి రుచిచూసి నచ్చితే తిన కలిగితే కావలసినంత మాత్రమే వేయించుకుని లేదా వడ్డించుకుని తినినట్లు అయితే ఆహార దుర్వినియోగం జరగదు. విడిచిపెట్టిన ఆహారం పెంటపాలు కానేరదు. ఒకవేళ ఫంక్షన్స్‌లో అందరూ తినగా ఆహార పదార్ధాలు దుర్వినియోగం కాకుండా మిగిలినట్లయితే ఆహారం లేక ఎంతోమంది ఉంటున్నారు. వారికి అందజేయ గలిగితే ఆ ఉత్సవం, పండుగ ఫంక్షన్ పేరేదయినా దిగ్విజయంగా ముగిసినట్లుగా భావించవచ్చు.
అమర్‌నాథ్ యాత్రలో తీర్థయాత్రల్లో భాగంగా అందరూ వెళుతుంటారు. ఆ యాత్ర త్రోవలోను యాత్రలోను ఆహార అంగళ్ళుంటూంటాయి. వాటిని లంగర్లు అంటారు. ఉత్తరాది లంగర్లతోపాటు మన తెలుగు వారు కూడా లంగర్లు ఏర్పాటుచేసారు. అవన్నీ ఉచితంగా టీ, టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి టిఫిన్ వగైరాలన్నీ సరఫరా సేవాభావంతో చేస్తుంటారు.
వీటి గురించి ప్రస్తావించడానికి కారణం అక్కడ పారవేయడానికి సేవ చేస్తున్న సరఫరా దారులు ఒప్పుకోరు. ఆహారం పళ్ళేంలో ఎంత వేస్తారో అది అంతా తినాలి, పారవేస్తే అది తీసి వారిని మరల తినమంటారు.
ఇంకొక ముఖ్య విషయం పునర్జన్మలు నమ్మకం ఉంటే ఈ విషయం నమ్మాలి. మనం తినే విస్తర్ణంలో ఆహార పదార్ధాలు పార వేస్తూంటే మరు జన్మలో ఎవరు పారవేసిన పదార్ధాలు స్వీకరించవలసి వస్తుందని పెద్దలు అంటూంటారు.
అప్పుడప్పుడు పారవేసిన విస్తరాకుల్లో కుక్కలు, పందులు జంతువులే కాకుండా భిక్షకులు ఏరుకుని తినడం చూస్తూంటారు.
ఏది ఏమైనా ఆహార పరిశుభ్రతతోపాటు ఆహారం సద్వినియోగం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అనుకుందామా. బాధ్యత అంటే బరువనిపిస్తే కర్తవ్యం లేదా విధి అనుకుందాం.
మనం మంచి ఆహారం తిందాం! ఇతరులచే ఆహారాన్ని తినిపించుదాం! ఇదే ప్రతీ ఒక్కరూ అనుకోవలసినది ముఖ్యంగా పాటించవలసినదిగా జరిగితే ఆహారం వృధా జరుగదు. వ్యాపారంలోని నియమ నిబంధనలుండి ఆహార వినియోగంపై ఎవరికి వారే నియంత్రణ తీసుకుంటే విలువలు నిలబడతాయి.

- గంటి కృష్ణకుమారి 9441567395