ఆంధ్రప్రదేశ్‌

పిల్లలను తోసి.. తాను దూకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడుస్తున్న రైలులోంచి దూకి మహిళ ఆత్మహత్య * కుమార్తె మృతి * ప్రాణాపాయ స్థితిలో కుమారుడు
తెనాలి, డిసెంబర్ 24: వెళ్తున్న రైలు నుండి ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను కిందకు తోసి తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సంచలనం కలిగించింది. గుంటూరు జిల్లా తెనాలి జిఆర్‌పి పోలీసుల కథనం ప్రకారం విజయవాడ నుండి తెనాలి మీదుగా చెన్నై వైపు వెళ్తున్న రైలు నుండి తెనాలి, చుండూరు రైల్వేస్టేషన్ల మద్యం ఓ మహిళ ఇద్దరు పిల్లలతో సహా కిందకు దూకింది. ఆమె మృతి చెందగా తీవ్ర గాయాలతో ఇద్దరు పిల్లలు పడి ఉన్నారన్న సమాచారం జిఆర్‌పి పోలీసులకు అందింది. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగినా సమాచారం గురువారం ఉదయం తెలుసుకున్న జిఆర్‌పి ఎస్‌ఐ ప్రభాకరరావు తన సిబ్బందితో ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు పిల్లలను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విజయవాడకు చెందిన కోట కళ్యాణ చక్రవర్తి భార్య సుస్విత (33), కుమార్తె నైతిక (5), కుమారుడు జాగృ (3)తో జీవిస్తున్నారు. చక్రవర్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. పూణేలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడే భార్యా బిడ్డలతో స్థిరపడ్డాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు మృతుల బంధువులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో పూణే నుండి విజయవాడ పిల్లలతో వచ్చిన సుస్మిత తిరిగి పూణే వెళ్తూ తెనాలి- చుండూరు రైల్వే స్టేషన్ల సమీపంలో తన ఇద్దరు పిల్లలను ముందుగా వేగంగా వెళ్తున్న రైలు నుండి కిందకు తోసి, తాను కిందకు దూకింది. సుస్మిత అదే రైలు కింద పడి దేహం ముక్కలు కాగా నైతిక, జాగృలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన పిల్లలు ఇద్దరిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నైతిక మృతి చెందినట్లు, జాగృ ప్రాణాపాయ స్థితిలో మృత్యువుతో పోరాడుతున్నట్లు ఎస్‌ఐ ప్రభాకరరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.