ఆంధ్రప్రదేశ్‌

ప్యాకేజీలో 100 శాతం నిధులు : సుజనాచౌదరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర ప్రభుత్వం 90శాతం నిధులు మాత్రమే భరిస్తుందని, ప్యాకేజీలో కొన్ని అంశాలకు 100 శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్రం సమ్మతించిందని కేంద్రమంత్రి సుజనాచౌదరి ఆదివారం తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాతోనే అన్నీ వచ్చేస్తాయని అనుకోవడానికి లేదని, ప్రత్యేక హోదాపై కొందరు నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్యాకేజీలో పేర్కొన్న హామీల్లో కొన్నింటిని కేంద్రం ఇప్పటికే అమలు పరిచిందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం పూర్తిస్థాయిలో న్యాయం చేస్తుందనడంలో తమకు ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.