వినదగు!

ఉత్పత్తి, వికాస చేష్ఠలే కర్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవన గీతలో మనం ‘నిష్ఠా’గరిష్ఠులం. అటు జ్ఞానయోగం ద్వారా గానీ, ఇటు కర్మయోగం ద్వారా గానీ ఈ ‘నిష్ఠ’ సాధ్యమవుతుంటుంది. కర్మాచరణతోనే మనకు యోగనిష్ఠాసిద్ధి. దీనే్న నైష్కర్మ్యం అని అంటుంటాం.
‘న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మ కృత్
కార్యతే హ్యవశః కర్మ స్వరః ప్రకృతి జైర్గుగైః’
మనం క్షణకాలం కూడా కర్మాచరణ నుండి విముక్తం కాలేం. పైగా కర్మలన్నీ ప్రాకృతిక గుణాలకు లోబడి చేస్తున్నవే. ఇలా మనం నిత్యమూ కర్మిష్ఠులమే!
కర్మిష్ఠులమైన మనం ‘నేను’ నుండి పుట్టుకొచ్చిన వారమే!
ఇంతకీ ‘నేను’ భౌతికమా? అధిభౌతికమా?
భౌతికంగా నేను పంచభూతాత్మక దేహరూపం.. అధిభౌతికంగా ఆత్మకం.
అంటే భౌతిక ‘దేహం’ అధిభౌతిక ‘ఆత్మ’ కలిస్తేనే ‘నేను’
ఈ దేహానికి, ఆత్మకు వారధి మనసు.
ప్రాపంచిక యానంలో దేహాన్ని, ఆత్మను మనసు నియంత్రిస్తుంటుంది.
అయితే భౌతిక ఆచ్ఛాదనల నుండి విడివడటం ప్రారంభిస్తే మనసు నిష్క్రమిస్తుంది.. నియంత్రణ అమానసం అవుతుంది.
మొత్తానికి భౌతిక ఆత్మ అధిభౌతిక పరమ ఆత్మగా సంపన్నం కావాలి. ‘పరం’ అభేదం కావటానికే మన యోగ సాధన... ఆధ్యాత్మికత్వమంతా. మానవత్వంలో దివ్యత్వం పరీమళించటానికే ఆధ్యాత్మిక ప్రయాణం.. ఆత్మయానం.
మొత్తానికి నా దేహం, నా మనసు కలిస్తేనే ‘నేను’. పాంచభౌతిక ప్రకృతితో మమేకం కాగలిగితేనే ‘నా’కు అస్తిత్వం. ‘నా’లోని మనసును తొలి దశలో భౌతికత నుండి విడివడేలా చేసి, మలిదశలోని భక్తి మార్గం నుండీ ఎదగగలిగితే ‘నా’తత్వం ‘పర’తత్వం ‘పరమ’తత్వంగా ఉన్నతమవుతుంద.. అదే పరమాత్మ తత్వం.
పరమాత్మ తత్వానే్న అనంత చైతన్యం అంటున్నాం. ఆ అపార చైతన్యానికి ఒక రూపమిచ్చి భగవన్నామ స్మరణతో పరవశిస్తున్నాం. ఆ తత్వాన్ని మన మానవ తత్వానికి భిన్న తత్వమైన అపార చైతన్య అస్తిత్వంగా విలసిల్ల చేయటమే యోగధ్యాన సాధన. ఈ పరమతత్వాన్ని అభిన్నం అని ఎందుకు అంటున్నామంటే మన భౌతిక, మానసిక తత్వాలను సైతం తనలో పొదువుకుంది కాబట్టి.
ఈ పరమాత్మ నుండే భౌతికత వ్యాపిస్తోందని, ఆ పరమాత్మలోనే సకలమూ పరివ్యాప్తమై ఉందని, ఆ పరమాత్మలోనే సర్వమూ లయిస్తోందని విశ్వసిస్తున్నాం. పైగా మనం రకరకాల అస్తిత్వాలను ప్రత్యేకాంశలుగా చెప్పుకుంటున్నప్పటికీ అన్నింటి సమాహారమే పరమాత్మ అస్తిత్వం... అది నిశ్చలం, నిర్మలం, నిరంతరం.
ఈ మార్గాన సర్వకర్మలకూ పరమాత్మకు రూపమైన భగవంతుడే కర్త అవుతున్నాడు. మనలను తోలుబొమ్మలను చేసి ‘కర్మ’ రూపేణా ‘ఆట’ ఆడిస్తున్నాడనుకుంటే మన కర్మఫలాల బాధ్యత ఆ పరమాత్మదే కావాలి! అయితే, కర్మఫలాలను భౌతికంగా అనుభవిస్తోంది ‘నేను’ కాబట్టి పరమాత్మ ఆ బాధ్యతను తాను వహించక ఆ భారాన్ని మనపైనే మోపుతుంటాడు. తాను కేవలం మార్గదర్శిగా ఉంటూ బాట చూపుతూ, నడక సాగించమంటాడు.
ఇలా మనం ‘కర్మ’జీవలం. భౌతికంగా అలసిపోవటం కర్మజీవుల నైజం. అందుకే అధిభౌతికంగా ‘సేద’ తీరుతుంటాం... సేద తీరుతూ కర్తవ్యోన్ముఖులం అవుతుంటాం. ఆ కర్తవ్య పరాయణతా విషయంలో మార్గదర్శి పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మను జ్ఞాన ప్రపూర్ణంగాను, ప్రేమ స్వరూపంగాను, పరమపూజ్యంగాను పరిగణిస్తున్నాం.
ఇంతకీ ‘పరమాత్మ’ ‘మార్గదర్శి’యేనా?
అంటే ‘అవును’ అనే అంటుంది భగవద్గీత.
మానవత్వానికి సారథ్యం వహించేది ఆ దివ్యత్వమే. మన జీవాత్మకు సారథ్యం వహించేది ఆ పరమాత్మనే. కురుక్షేత్రంలోకి అడుగిడిన అర్జునుడు మనలోని వాడే!
అర్జునుడి రథసారథి కృష్ణుడూ మనవాడే! లౌకికంగా విచలితమవుతున్న అర్జునుడ్ని కర్మిష్ఠిని చేసే ప్రయత్నంలో అష్టాదశ మార్గాల ‘స్వయం సంపూర్ణం’ చేసినవాడు కృష్ణుడు. పద్దెనిమిది మార్గాలు చేరుకునేవి ఆ పరమ తత్వానే్న. ‘ఒన్‌నెస్’ అని చెప్పుకుంటున్నది ఆ పరమ తత్వానే్న.
పరమాత్మ, జీవాత్మ, కర్మ-లను గురించి భగవద్గీత
‘అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మ ముచ్యతే/ భూత భావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః’
అని అంటుంది. అంటే - సర్వ శ్రేష్ఠం, శుద్ధం, శాశ్వతం పరమాత్మ అనీ, స్వ స్వరూపమే జీవాత్మ అనీ, వివిధ అంశలుగా పరమాత్మలో లీనమైన సకల భూతాల ఉత్పత్తి వికాసాలకు కారణమైన చేష్టనే కర్మ అనీ. ఇక మన దేహాలలో ఉన్నది ఒక్క జీవాత్మనే కాదు.. ఆ దేహాలలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ అస్తిత్వం అచలం.
* * *
పరమాత్మ లేదా పరబ్రహ్మను సర్వజ్ఞునిగాను, సనాతనుడిగాను, అనుశాసనుడిగాను, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడిగాను, అందరిని ధరించి భరించే వాడిగాను, అచింత్య రూపంగాను, సూర్యునిలా నిత్య చైతన్య ప్రకాశితంగాను, అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడిగాను పరిగణించడం జరుగుతుంటుంది.
‘సర్వ ద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ/ మూర్ధ్న్యా ధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్’/ ‘ఓమిత్యే కాక్షరం బ్రస్మ వ్యాహరన్ మా మనుస్మరన్/ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్’
మన దేహంలోని సర్వేంద్రియాలను నిగ్రహించాలి. మనస్సును హృదయ స్థానంలో స్థిరంగా నిలపాలి. స్థిర మనస్కతతో ప్రాణాన్ని సహస్రారానికి చేర్చి స్థిరపరచాలి. తొలి దశలో శబ్ద సాధనే అయినా మలి దశలో ధ్యానమగ్నం - ఇదీ గీత చెప్పే దైనందిన యోగసాధన. నిజానికి ఈ దైనందిన సాధన చాల సులభం, సహజం.
ఇటువంటి నిరంతర యోగ సాధనతో మనం దేహం - మనస్సుల నుండి బయటపడి ‘విశాలం’ ‘విస్తృతం’ అవుతాం.. దేహం, మనసు కాని ‘నేను’ను గుర్తిస్తాం.. ఆ ‘నేను’గా జీవిస్తాం.
ఇంతకీ ఈ ‘నేను’ - నిత్యం, సత్యం, అవినాశం, సర్వగతం, అప్రమేయం, అభోక్తం - కావటమే యోగం.

-డా.వాసిలి వసంతకుమార్ 93939 33946