రాష్ట్రీయం

ఆదిత్యునికి కిరణ స్పర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 10: ఉత్తరాయణ సూర్యగమణ మార్పుల కారణంగా సుప్రసిద్ధ అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయంలో గురువారం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సూర్యోదయ తొలి కిరణాలు ఆలయ ప్రధాన ద్వారం గుండా అనివెట్టి మండపం, ధ్వజస్తంభం మీదుగా ఆదిత్యుని మూలవిరాట్టును తాకాయి. ఈ అద్భుత కిరణ స్మర్శ ఉదయం 6.20 గంటల నుంచి పది నిమిషాల పాటు కనువిందు చేసింది. సూర్యుని లేలేత కిరణాలు నిత్యపూజలందుకుంటున్న ఆదిత్యుని మూలవిరాట్టును తాకగానే కృష్ణశిలతో కూడిన భాస్కరుడు బంగారు రంగులో మెరిసిపోవడంతో ఆ అద్భుత దృష్యాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంతో మునిగిపోయారు. భానుడి లేలేత కిరణాలు భక్తులపై పడినా, లేదా ఆదిత్యుని కిరణ స్మర్శను వీక్షించినా ఎటువంటి రోగాలు దరిచేరవని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ చెప్పారు. వాతావరణం అనుకూలించిన పక్షంలో శుక్రవారం మరోసారి ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించే అదృష్టం కలుగుతుందని ఆయన తెలిపారు. గతానికి భిన్నంగా ఎక్కువ సమయం కిరణ దర్శన భాగ్యం లభించడం తమ అదృష్టమని భక్తులు పేర్కొన్నారు. ప్రతి ఏడాది మార్చి, అక్టోబర్ నెలల్లో సూర్యకిరణాలు నేరుగా శ్రీ సూర్యనారాయణ స్వామి విగ్రహంపై ప్రసరిస్తాయి. ఈనెల 9, 10, 11 తేదీల్లో సూర్యకిరణాలు ప్రసరిస్తాయని తెలిసి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సూర్యగ్రహణం కావడంతో 9వ తేదీ కిరణాలు ప్రసరించలేదు. గురువారం మాత్రం ఏకంగా పది నిమిషాలు కిరణాలు ఆదిత్యుని విగ్రహాన్ని తాకాయి.