రాష్ట్రీయం

ఫలించని కేంద్రం చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: అమెరికా నుంచి తెలుగు విద్యార్థులను తిరిగి పంపించడంపై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, విమానయాన మంత్రి అశోక్‌గజపతి రాజు అమెరికా అధికారులతో జరిపిన చర్చలు ఫలించలేదని అమెరికా నుంచి వచ్చిన విద్యార్థులు అందోళన చెందుతున్నారు. గత నెల 27న వీరు ఢిల్లీలో సమావేశమై విద్యార్థుల భవితవ్యంపై చర్చించి, అమెరికా అధికారులతో మాట్లాడి స్పష్టత వచ్చిన తరువాత ప్రకటిస్తామన్న విషయం విధితమే. కాగా తెలుగు విద్యార్థులు చదువుతున్నది రికగ్నైజ్డ్ యూనివర్సిటీలు కావని ఇమిగ్రేషన్ అధికారులు పేర్కొన్నట్టు మాత్రమే కేంద్ర మంత్రులు తెలిపారు. కానీ తమవద్ద అన్ని డాక్యుమెంట్లు సరిగ్గానే ఉన్నాయని విద్యార్థులు ఎంత నచ్చజెప్పినా యూనివర్సిటీకి చేరకముందే అధికారులు తమను అదుపులోకి తీసుకొని తిరిగి పంపిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. అమెరికాలో విద్యార్థుల కష్టాలింకా కొనసాగతున్నాయని, ఇప్పటికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని విద్యాసంవత్సరం వృథాకాకుండా తిరిగి అమెరికా పంపిచే ఏర్పాట్లు చేయాలని శంషాబాద్ చేరుకున్న విద్యార్థులు కోరుతున్నారు.