రాష్ట్రీయం

రెండో పెళ్లి కేసులో ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: తన భర్త మృతిపై ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళను మభ్యపెట్టి రెండో పెళ్లి చేసుకున్న డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. దిలావత్ అనే ఆ డిటెక్టివ్ ఇనె్స్పక్టర్‌కు ఇదివరకే పెళ్లయి భార్య ఉండగా, వేరే కేసులో న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆ మహిళను నమ్మించి రెండో పెళ్లి చేసుకున్నాడు. నాలుగైదు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనపై ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి డిటెక్టివ్ ఇనె్స్పక్టర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. భర్త మరణించిన ఆవేదనలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను రెండో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు కమిషనర్ ఇన్‌స్పెక్టర్‌ దిలావత్‌ను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది.