రాష్ట్రీయం

29న తిరుపతిలో ఐటి సింపోజియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) ని అడుగడుగునా వినియోగించుకునే ప్రణాళికలో భాగంగా ఈ నెల 29 న తిరుపతిలో ‘ఎలెట్స్ ఇ-గవ్’ పేరుతో ఐటిసి సింపోజియం ఏర్పాటు చేస్తున్నారు. జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులున్న అనేక సంస్థలు పాల్గొంటున్నాయని రాష్ట్ర ఐటి సలహాదారు జె. సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారన్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా సింపోజియంలో చర్చలు ఉంటాయని వివరించారు. తిరుపతిలోని ‘్ఫర్చూన్ సెలెక్ట్ గ్రాండ్ రిడ్జ్’ హోటల్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ఉన్నతాధికారులు, ఐటి సంస్థల ప్రతినిధులు ఈ సింపోజియంలో పాల్గొంటారని వివరించారు. ఈప్రగతి, మీసేవ, భారత్‌నెట్ అంశాలపై చర్చతో పాటు రాష్ట్రంలో ఐటి రంగంలో పెట్టుబడులను ఆకర్షించే అంశాలపై చర్చిస్తామని సత్యనారాయణ తెలిపారు. డిజిటల్ ఆంధ్రప్రదేశ్, స్మార్ట్ పట్టణాల్లో ఐసిటి వినియోగంపై చర్చిస్తామన్నారు. ఐసిటిలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి కల్పించాల్సిన సదుపాయాలపై చర్చిస్తామని ప్రభుత్వ సలహాదారు తెలిపారు.

చంద్రబాబుకు ఆదర్శ ముఖ్యమంత్రి పురస్కారం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆదర్శ ముఖ్యమంత్రి పురస్కారాన్ని పూణెకు చెందిన భారతీయ చాత్ర సంసద్ అనే సంస్ధ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీన తమ సంస్ధ వార్షిక ముగింపు సమావేశంలో ఈ అవార్డును చంద్రబాబుకు ప్రదానం చేయనున్నట్లు ఆ సంస్ధ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ రాహఉల్ విశ్వనాథ్ కరాడ్ పేర్కొన్నారు. పూణెలో మిట్ క్యాంపస్‌లో స్వామి వివేకానంద స్వామి సభామంటపంలోజరుగుతుంది. మహారాష్ట్ర శాసనమండలి చైర్మన్ రాంజేనాయక్ నింబల్కర్ ఈ అవార్డును ప్రదానం చేస్తారు. గతంలో ఈ అవార్డును మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఇచ్చామన్నారు.