రాష్ట్రీయం

ట్రిబ్యునల్ స్టే బేఖాతరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: ప్రతి ఏటా మూడు సీజన్లలో 120 రకాల పంటలు పండించే 33వేల ఎకరాల భూములను అదిరించి, బెదిరించి కైవసం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములను విదేశీ కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తోందంటూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమవేత్త పండలనేని శ్రీమన్నారాయణ ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో కోట్లాది రూపాయలు వెచ్చించి పనులు ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ తాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు దాఖలు చేసి ఎలాంటి పనులు చేపట్టరాదంటూ స్టే జారీ చేయించినప్పటికీ తాజాగా తాత్కాలిక రాజధాని సచివాలయం పేరిట టెండర్లు పిలవటం, మాస్టర్ ప్లాన్‌ను ఖరారు చేసేందుకు బలవంతపు సమావేశాలు నిర్వహించడాన్ని తాను మళ్లీ ట్రిబ్యునల్‌లో సవాల్ చేసినట్టు ఆయన చెప్పారు. శుక్రవారం నాడిక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో శ్రీమన్నారాయణ మాట్లాడారు. వాస్తవానికి 1.7 చ.కిమీ పరిధిలోని కట్టడాలకు మాత్రమే రాష్ట్ర బోర్డుకు అనుమతిచ్చే అవకాశం వుండగా 217 చ.కిమీ పరిధిలో నిర్మాణం జరిగే రాజధానికి రాష్ట్ర బోర్డు ఎలా అనుమతిస్తుందని ఆయన ప్రశ్నించారు. ట్రిబ్యునల్‌లో స్టే వున్నప్పటికీ రూ.40కోట్లు పైగా ఖర్చుచేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారని తాజాగా తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నారంటూ ఆరోపించారు. సమగ్ర సమాచారాన్ని అందించాలని ట్రిబ్యునల్ ఆదేశించినప్పటికీ సిఆర్‌డిఏ ఆ ఆదేశాలు పాటించడం లేదంటూ దీనిపై గురువారం తాను ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేయడం జరిగిందని, దీనిపై ఫిబ్రవరి 23వ తేదీ విచారణ జరుగనున్నదన్నారు.
జనాభా సంఖ్యపై సిఎం ప్రకటన తప్పుల తడక
రాజధాని అమరావతి ప్రాంతంలో పరిసరాలతో కలిపి ప్రస్తుతం 40 లక్షల జనాభా వుండగా వచ్చే 20 ఏళ్లలో ఆ సంఖ్య కోటికి దాటుతుందంటూ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు తప్పుల తడకలంటూ హైదరాబాద్‌లో ఒక పరిశోధనా సంస్థలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న డాక్టర్ సి రామచంద్రయ్య ఆరోపించారు. నానాటికీ జనాభా గణనీయంగా తగ్గుతున్న రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు తరువాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో వుందన్నారు. కొన్ని వందల ఏళ్లుగా అభివృద్ధి చెందిన 700 చ.కిమీ పరిధి కలిగిన హైదరాబాద్ నగరంలో 1991 నాటికి 43 లక్షల జనాభా వుండగా ఐటి రంగం అభివృద్ధి చెందిన తరువాత 2001 నాటికి 57 లక్షలు, 2011 నాటికి 70 లక్షలకు చేరిందని అన్ని రాష్ట్రాల నుంచి వలసలు ఉన్నప్పటికీ జనాభా పెరుగుదల నామమాత్రంగా వుందనే విషయాన్ని గుర్తించాలన్నారు.