బిజినెస్

త్వరలో ‘కింగ్‌ఫిషర్’ ఆస్తుల అమ్మకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: తమ బకాయిల్లో కొంతమేరకైనా రాబట్టుకోవడం కోసం నష్టాల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆస్తులను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీస్(ఎఆర్‌సిఎస్)కు విక్రయించాలని కనీసం నాలుగు బ్యాంకులు అనుకుంటున్నాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌నుంచి రావలసిన రూ 6,963 కోట్ల బకాయిలను రాబట్టుకోవడానికి ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియం అష్టకష్టాలు పడుతోంది. తమ అధీనంలో ఉన్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆస్తుల ద్వారా కొంత విలువనైనా రాబట్టుకోవడానికి వాటిలో కొంత వాటాలను ఎఆర్‌సిఎస్‌కు విక్రయించాలని కనీసం మూడు, నాలుగు బ్యాంకులు యోచిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ బ్యాంకులేవో వెల్లడించడానికి నిరాకరించిన ఈ వర్గాలు ఈ బ్యాంకులు లాభనష్టాలను బేరీజు వేస్తున్నాయని, అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీస్‌తో చర్చలు జరుపుతున్నాయని తెలిపాయి. ఈ వారం ప్రారంభంలో ఈ కన్సార్టియంలో ఒకటయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను, దాని గ్యారంటీర్లు విజయణ మాల్యను, యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్‌ను విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటించడం తెలిసిందే. ఇంతకుముందు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బిఐ కూడా ఇదే పని చేశాయి. రిజర్వ్ బ్యాంక్ గైడ్‌లైన్స్ ప్రకారం ఒకసారి విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటించాక అలాంటి రుణగ్రహీతలకు ఏ బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలనుంచి అదనపు సదుపాయాలు ఏమీ పొందడానికి వీలుండదు. అలాగే, విల్‌ఫుల్ డిఫాల్టర్ల జాబితానుంచి వాటి పేర్లను తొలగించిన తేదీనుంచి అయిదేళ్ల పాటు కొత్త వెంచర్లను ప్రారంభించడానికి ఎలాంటి సంస్థాగత ఆర్థిక సహాయం పొందడానికి కూడా వీలుండదు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌నుంచి ఎస్‌బిఐకి అత్యధికంగా రూ. 1600 కోట్లు బకాయిలు రావలసి ఉంది.