తెలంగాణ

టి-హబ్‌కు పెట్టుబడుల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: టి-హబ్‌లో పెట్టుబడులకు అమెరికాలోని ఇల్లినాయిస్‌లో పలు సంస్థలు ఆసక్తి చూపించాయి. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రెండు వారాల పాటు అమెరికా పర్యటనకు వెళ్ళగా, కెటిఆర్‌కు చికాగో నగరంలో తెలంగాణ ప్రవాస భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ భారత కాన్సుల్ జనరల్ అసఫ్ సయిద్‌తో మంత్రి సమావేశం అయ్యారు. అలాగే సయిద్‌తో కలిసి ఇల్లినాయిస్ డిప్యూటి గవర్నర్ ట్రె చిల్డ్రెస్‌తో ఆయన కార్యాలయంలో కెటిఆర్ సమావేశం అయ్యారు. ఇల్లినాయిస్-తెలంగాణ మధ్య భాగస్వామ్యంగల అంశాల గురించి ఈ సందర్భంగా చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే ఇల్లినాయిస్ సంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి తెలిపారు. తెలంగాణ ఐటి పాలసీ గురించి, పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం గురించి, ఫార్మా, ఐటి రంగాల్లో ఉన్న అవకాశాలను కెటిఆర్ వివరించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వ పాలసీలను అభినందించిన డిప్యూటీ గవర్నర్ తెలంగాణతో ఇనే్నవేషన్ రంగంలో భాగస్వామ్యానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి-హబ్ గురించి విన్నామని, ఇల్లినాయిస్‌లో పలు సంస్థలు ఇన్నోవేషన్ రంగంలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నాయని చెప్పారు. తమ రాష్ట్రంలోని చికాగో నగరంతో తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ప్రత్యేకానుబంధం ఉందన్నారు. హైదరాబాద్‌కు చెందినవారు పెద్ద సంఖ్యలో ఇక్కడున్నారని డిప్యూటీ గవర్నర్ గుర్తు చేశారు. కాగా, పలువురు పెట్టుబడిదారులతోనూ కెటిఆర్ సమావేశమయ్యారు. రెడ్ బెర్రీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ క్రాంతితో కెటిఆర్ సమావేశమై తెలంగాణకు ఆహ్వానించారు. అలాగే అబ్‌రిస్ క్యాపిటల్ అధ్యక్షుడు ఒమర్ అహ్మద్, మోనిఫ్ మటోక్ చైర్మన్, సాఫీ హోల్డింగ్ సిఇఓలను కలిశారు. ఈ సందర్భంగా పలు ఎంఓయులను కుదుర్చుకున్నారు. ఇదిలావుంటే డిజిటల్ హెల్త్‌కేర్ సంస్థ ఇక్‌లాట్ హెల్త్ సొల్యూషన్ 15 మిలియన్ డాలర్ల (రూ. 100 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీని వల్ల 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయ. అనంతరం చికాగో నుండి ఇండియానా పోలీస్ బయలుదేరిన మంత్రి కెటిర్.. అక్కడ ఇండియానా పోలీస్ గవర్నర్ మైక్ పెన్స్‌తో సమావేశం అయ్యారు. త్వరలోనే హైదరాబాద్ మేయర్ ఇండియానా పోలీస్ వస్తారని కెటిఆర్ తెలిపారు. కెటిఆర్ వెంట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు ఉన్నారు.