రాష్ట్రీయం

గవర్నర్ ప్రసంగం అడ్డుకుంటే ఏడాది సస్పెన్షన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మెల్యేలకు వర్తించనున్న కొత్త రూల్

స్పీకర్ అధ్యక్షతన రూల్స్ కమిటీ ప్రతిపాదన మరోసారి చర్చించాలని నిర్ణయం

హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించేప్పుడు ఎమ్మెల్యేలు ఆటంకపర్చేందుకు ప్రయత్నించినా, అడ్డుకున్నా ఏడాదిపాటు సభ నుంచి సస్పెన్షన్ వేటు తప్పదు. ఈమేరకు అసెంబ్లీలో కొత్త రూల్ రాబోతోంది. అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాలులో రూల్స్ కమిటీ సమావేశమైంది. కమిటీకి స్పీకర్ మధుసూదనాచారి చైర్మన్‌గా ఉన్నారు. సభ్యులుగా ఉన్న రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి టి హరీశ్‌రావు, తెరాస తరఫున ప్రభుత్వ చీఫ్ విప్ కె ఈశ్వర్, బిజెపి శాసనసభాపక్షం నాయకుడు కె లక్ష్మణ్, మజ్లిస్‌పక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ, కెపి వివేకానంద (తెదేపా), సున్నం రాజయ్య (సిపిఎం), అసెంబ్లీ కార్యదర్శి ఎస్ రాజాసదారామ్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ సభ్యుడు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు సజావుగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపైనే వారు చర్చించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను (అసెంబ్లీ, కౌన్సిల్) ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు విపక్షాల సభ్యులు పేపర్లు చింపి విసిరుతున్నారని, మైకులు విరిచేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి సంఘటనలతో అసెంబ్లీ గౌరవ ప్రతిష్టలకు విఘాతం కలుగుతోందని స్పీకర్ మధుసూదనచారి ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి వారిపై ఏడాదిపాటు సభనుంచి సస్పెండ్ చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. దీంతో ఎమ్మెల్యేలు లక్ష్మణ్, రాజయ్య అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదో రన్నింగ్ కామెంటరీ చేసినంత మాత్రాన సస్పెండ్ చేయడం భావ్యంకాదని ప్రస్తావించారు. అందుకు మంత్రి హరీశ్‌రావు ప్రతిస్పందిస్తూ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన సస్పెన్షన్ ఉండదన్నారు. గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు మైకు విరిచేందుకు ప్రయత్నించినా, చదివే పాఠాన్ని లాక్కోవడానికి ప్రయత్నించినా, గవర్నర్ సభలోకి వస్తున్నప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేసినా సస్పెండ్ చేయాలని సూచించామన్నారు. దీనిపై క్షుణ్ణంగా మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలని విపక్షాల ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు.