తెలంగాణ

ఎమ్మెల్యేలెవ్వరూ ‘చే’జారనివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై ఆ పార్టీ అధిష్ఠానం భారీ బాధ్యతను మోపింది. పార్టీ నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే ‘చే’జారి పోకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని అధిష్ఠానం ఆయన్ను ఆదేశించింది. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఢిల్లీలో ఆయన ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ‘ఎమ్మెల్యేలు ‘చే’జారకుండా చూడాల్సిందిగా నా మాటే కాదు పార్టీ అధినేత్రి ఆదేశం..’ అని దిగ్విజయ్ సింగ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి చెప్పారు. ఒక ఎమ్మెల్యే ఫిరాయించడం మొదలుపెడితే, ఇక వరుసపెట్టి వలసలు ప్రారంభమై పార్టీ నష్టపోతుందని ఆయన హెచ్చరించినట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఫిరాయించే అవకాశం ఏమీ లేదని, అటువంటి ఆలోచన ఏదీ ఎవరికీ లేదని ఉత్తమ్‌కుమార్ ఆయనకు చెప్పినట్లు తెలిసింది. అయితే ఎమ్మెల్యే సంపత్ తదితరులు పార్టీ ఫిరాయించనున్నట్లు ప్రచారం జరుగుతున్నదని చెప్పారు. ఈ అంశంపై తాను ‘ఆరా’ తీశానని, అటువంటిదేమీ లేదని స్పష్టమైందని ఆయన వివరించారు. కాగా మీడియాలో ఒక వర్గం ఇటువంటి ప్రచారం చేస్తున్నదని ఆయన దిగ్విజయ్‌కు తెలిపారు.
ఇలాఉండగా వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపైనా కొంత సేపు వారు చర్చించారు. పార్టీ శక్తివంచన లేకుండా విజయానికి కృషి చేస్తున్నదని చెప్పారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన అత్యాచారం ఘటనపై తీవ్రంగా స్పందించడం జరిగిందని, పార్టీ తరఫున మహిళా నేతలను పంపించినట్లు ఆయన వివరించారు. కాగా, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ (జిహెచ్‌సిసి) అధ్యక్షుడు దానం నాగేందర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ తమ పదవులకు రాజీనామా చేసిన అంశం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. దానం రాజీనామాను ఇదివరకే ఆమోదించినందున, ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకోవాలని, జిహెచ్‌సిసినే కాకుండా అన్ని జిల్లాల పార్టీల కమిటీలను పునర్‌వ్యవస్థీకరించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా దిగ్విజయ్ సింగ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఆదేశించినట్లు తెలిసింది.