తెలంగాణ

మెట్రో రూటు మార్చాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: మహానగరంలో మెట్రోరైలు పనులకు సంబంధించి ప్రభుత్వం ముందుగా ప్రతిపాదించిన రూట్లలోనే పనులు చేపట్టనున్నట్లు మెట్రో కన్సార్టియం సంస్థ ఎల్ అండ్ టి మేనేజింగ్ డైరెక్టర్ గాడ్గిల్ చేసిన ప్రకటన సుల్తాన్‌బజార్ వ్యాపారులను ఆందోళనకు గురి చేసింది. సుల్తాన్‌బజార్ మీదుగా కాకుండా ప్రత్యామ్నాయమార్గంలో మెట్రోను నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చిన ఎల్ అండ్ టి అధికారులు ఇపుడు సుల్తాన్‌బజార్‌లోని కొన్ని భవనాల కూల్చివేతకు మార్కింగ్ చేయటాన్ని నిరసిస్తూ శుక్రవారం వ్యాపారులు బంద్ చేపట్టారు. ఉదయం నుంచే వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసి నిరసన చేపట్టారు. ‘సిఎం కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి! సేవ్ సుల్తాన్‌బజార్’ అన్న ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వ్యాపారులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, పరిస్థితిని అదుపు చేసేందుకు కొందరు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నిరసన ప్రదర్శనలు నిర్వహించకుండా సెక్షన్ 144ను అమలు చేశారు. సుల్తాన్‌బజార్ వ్యాపారులకు సిఎం కెసిఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. వ్యాపారుల నిరసనకు తాము సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రాజాసింగ్ వ్యాపారులను బిజెపి శాసనసభా పక్ష నేత లక్ష్మణ్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. తాము అండగా ఉంటామని లక్ష్మణ్ హామీ ఇచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అనంతరం సుల్తాన్‌బజార్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రధాన కారదర్శి మధసూదనరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కూడా సుల్తాన్‌బజార్ ఎంతో కీలక పాత్ర పోషించిందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.