తెలంగాణ

సచివాలయంలో పురుగుల మందుతో పట్టుబడ్డ ఓ తల్లి, బిడ్డ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలువడానికి సచివాలయానికి వచ్చిన ఓ తల్లి, కొడుకు పురుగుల మందు డబ్బాతో పట్టుబడ్డారు. సచివాలయానికి వచ్చిన వారిని ఎస్పీఎఫ్ సిబ్బంది వారిని తనిఖీ చేయగా పురుగుల మందు డబ్బా వారి కంట పడింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా వారిని మహబూబ్‌నగర్‌కు చెందిన బోడెమ్మ, మల్లేష్‌గా గుర్తించారు. పురుగుల మందు డబ్బాతో ఎందుకు వచ్చారని అడుగగా పత్తి పంటలో నష్టం రావడంతో ముఖ్యమంత్రిని కలిసేందుకు సచివాలయానికి వచ్చామని వారు తెలిపారు.
టిఎన్జీవోల హౌసింగ్ సొసైటీ స్కామ్‌పై
సిబిఐ విచారణకు హైకోర్టులో పిటిషన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 2: టిఎన్జీవోల హౌసింగ్ సొసైటీలో జరిగిన అవతవకతలపై సిబిఐ విచారణ జరిపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ప్రస్తుతం జరుగుతున్న పోలీసు విచారణపై కొంతమంది తమ పలుకుబడి ఉపయోగిస్తున్నారని పిటీషనర్ హైకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు వెంటనే ఇంతవరకు చేసిన విచారణ నివేదికను సమర్పించాల్సిందిగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సిసిఎస్) పోలీసులను ఆదేశించింది. ఈ వ్యవహారంలో లోగడ సిసిఎస్ పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు.

హైకోర్టులో పది మంది న్యాయమూర్తుల ప్రమాణం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 2: హైదరాబాద్ హైకోర్టులో నియమితులైన పది మంది శాశ్వత న్యాయమూర్తుల చేత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోస్‌లే బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ ఏ రామలింగేశ్వర రావు, బి శివశంకర రావు, ఎం సీతారామమూర్తి, ఎస్ రవికుమార్, యు.దుర్గాప్రసాద్ రావు, టి సునీల్ చౌదరి, ఎం సత్యనారాయణ మూర్తి, ఎంఎస్‌కె జైశ్వాల్, ఎ శంకర్ నారాయణ, అనిస్‌ను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం నోటిఫై చేసింది. వీరిని 2013 అక్టోబర్‌లో అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. కొలీజియం ఏర్పాటు కావడంలో జరిగిన జాప్యంతో వీరు ఇంతకాలం అదనపు న్యాయమూర్తులుగా కొనసాగారు.
మళ్లీ ఇరోమ్ షర్మిల అరెస్టు
ఇంఫాల్, మార్చి 2: సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలంటూ మళ్లీ తన నిరాహార దీక్షను ప్రారంభించిన ఇరోమ్ షర్మిలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇప్పటి వరకూ ఆమెపై ఎలాంటి కేసు పెట్టక పోయినా ఈ అరెస్టును సమర్థించుకోవడానికి పోలీసులు కొత్త మార్గాలు వెతుకుతున్నట్టు తెలుస్తోంది. ఆత్మహత్య అభియోగాల నుంచి షర్మిలను ఇంఫాల్ కోర్టు విముక్తి చేసిన గత నెల 29 తొమ్మిది నుంచే ఆమె మళ్లీ నిరాహార దీక్ష మొదలు పెట్టారు. వైద్య పరీక్షలు చేయించుకోవడానికీ నిరాకరించారు.2000లో ఇంఫాల్ ప్రాంతంలో పది మంది పౌరుల్ని కేంద్ర భద్రతా దళాలు ఊచకోత కోసినప్పటి నుంచీ ఈ చట్టాన్ని ఎత్తివేయాలని షర్మిల అహింసాయుత మార్గంలో ఉద్యమిస్తూనే ఉన్నారు.
రాజీవ్ హంతకుల్ని వదిలేస్తాం
తమిళనాడు సర్కార్ నిర్ణయం
కేంద్ర అభిప్రాయం కోసం లేఖ
చెన్నై, మార్చి 2: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్షను ఎదుర్కొంటున్న ఏడుగురు దోషుల శిక్ష కాలాన్ని తగ్గించి విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షికి లేఖ రాసింది. తాము ఇప్పటికే 20ఏళ్లకు పైగా జైలు శిక్షను అనుభవిస్తున్నామని, ఇప్పటికైనా తమను విడుదల చేయాలంటూ ఈ ఏడుగురు దోషులు అనేక పర్యాయాలు అభ్యర్థించారని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.జ్ఞానదేశికన్ తెలిపారు. ఈ పిటిషన్లను లోతుగా పరిశీలించిన తర్వాతే వారి శిక్ష తగ్గించి విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు.
హైదరాబాద్‌లో ఎస్‌సిజడ్‌సిసి ప్రాంతీయ కేంద్రం
6వ సభ్య రాష్ట్రంగా తెలంగాణ నమోదు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 2: దక్షిణ మధ్య మండలి సాంస్కృతిక కేంద్రం (ఎస్‌సిజడ్‌సిసి) ప్రాంతీయ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం జరిగింది. నాగపూర్ కేంద్రంగా పని చేస్తున్న ఈ మండలిలో ప్రస్తుతం 5 రాష్ట్రాలు సభ్యులుగా ఉన్నాయి. ఇప్పుడు ఆరవ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం చేరింది. బుధవారం నాడిక్కడ ఒక హోటల్‌లో జరిగిన ఎస్‌సిజడ్‌సిసి కార్యనిర్వాహక బోర్డు, పాలకమండలి ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మండలికి చైర్మన్‌గా ఉన్న మహారాష్ట్ర గవర్నర్ సి.విద్యాసాగరరావు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్‌సిజడ్‌సిసి ప్రాంతీయ కేంద్రంగా హైదరాబాద్, 6వ సభ్య రాష్ట్రంగా తెలంగాణను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ మండలిలో ప్రస్తుతం సభ్యత్వం కలిగి ఉన్నాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ దక్షిణాది కేంద్రం పని చేస్తుంది. సాంస్కృతిక కార్యకలాపాలు పెద్ద ఎత్తున ఈ కేంద్రం ద్వారా నిర్వహించడం జరుగుతోంది. గవర్నర్ విద్యాసాగర్‌రావు ఎక్కువ చొరవ తీసుకుని ఈ మండలిలో తెలంగాణ 6వ సభ్య రాష్ట్రంగా చేర్చారు. కొన్ని మెగా ఈవెంట్స్ ప్రాంతీయ కేంద్రంలో నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.