తెలంగాణ

జీవనదిని వృథాపోనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘సుదీర్ఘకాల పోరాటాల అనంతరం సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి మహారాష్ట్రంతో చేసుకున్న ఒప్పందం దోహదపడుతుంది’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. గోదావరి జలాలలో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. ముంబాయిలో మంగళవారం ఉదయం మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నివీస్‌తో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రజలకు అనేక ఆకాంక్షలు ఉన్నాయి, నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం పోరాటాలు చేసి ఎట్టకేలకు రాష్ట్రాన్ని సాధించుకున్నామని కెసిఆర్ అన్నారు. కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్లడానికి పొరుగు రాష్ట్రాలు ఎవరితోనూ ఘర్షణాత్మక వైఖరితో ఉండాలని కోరుకోవడం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తమ రాష్ట్రానికి పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌తో స్నేహశీల వైఖరితో నడుచుకుంటామన్నారు. ఇదే విషయాన్ని ముందుగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నివీస్‌తో చెప్పడంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించారన్నారు. భగవంతుడి దయవల్ల గోదావరిలో సరిపోయినన్ని నీళ్లు ఉన్నాయి, రెండు నుంచి నాలుగు వేల టిఎంసిల నీళ్లు వృధాగా సముద్రం పాలవుతున్నాయని అన్నారు. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చానని కెసిఆర్ చెప్పారు. గోదావరి జలాలలను మహారాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకున్న తర్వాత తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వినియోగించుకుంటాయన్నారు. మహారాష్టత్రో తెలంగాణకు చాలా పొడవైన సరిహద్దు ఉంది, వారితో సామరస్యపూర్వక సంబంధాలను కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కుదిరిన ఒప్పందం వల్ల రెండు రాష్ట్రాలకు మేలు కలుగబోతుందన్నారు. దీనికి ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా సానుకూల దృక్పథంతో ఉన్నారన్నారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఓట్ల రాజకీయంగానే చూశాయన్నారు. అయితే తమ ప్రభుత్వ హాయంలో ప్రాజెక్టులు వాస్తవరూపం దాల్చుతున్నాయన్నారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర సర్కార్ చెప్పినట్టుగానే నడుచుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మేడిగడ్డ ప్రాజ్క్టె విషయంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వ్యాప్కోస్ నిర్వహించిన సర్వే నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేశామన్నారు. మేడిగడ్డ బ్యారేజిలో నిలువ ఉండే నీటిని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వినియోగించుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒప్పందం మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే ప్రాజెక్టుల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభిస్తామన్నారు. ఒక్క నీళ్ల విషయంలోనే కాకుండా ఇతర విషయాలలో కూడా కలిసి నడుద్దామని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. నీటి కోసం చాలా రాష్ట్రాల మధ్య యుద్ధం నడుస్తున్నా, తాము మాత్రం సామరస్యంగా కలిసి ముందుకు సాగుతామని కెసిఆర్ అన్నారు. ‘ఒప్పందం స్నేహపూర్వక వాతావరణంలో జరగడం చాలా సంతోషం కలిగించింది. మీరు (ముఖ్యమంత్రి) మంత్రులు, అధికారులతో కలిసి హైదరాబాద్‌కు వస్తే ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ రుచి చూపిస్తాం’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానించారు.
ఒప్పందం ఇరు రాష్ట్రాల అభివృద్థికి బాట: ఫడ్నవీస్
తెలంగాణ-మహారాష్ట్ర మధ్య కుదిరిన ఒప్పందం ఇరు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తుందన్న ఆకాంక్షను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వ్యక్తం చేశారు. దేశాల మధ్య నీటి పంపకాలు జరుగుతున్న నేపథ్యంలో ఒకే దేశంలోని రెండు రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం ఎందుకు సాధ్యం కాదని ఆయన ప్రశ్నించారు. ఈ ఆలోచన నుంచే తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయన్నారు. ఏడాది కిందట ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్టక్రు వచ్చినప్పుడే తమ మధ్య ఒప్పందానికి అంకుర్పారణ జరిగిందన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని తాము మిత్ర రాష్ట్రంగా చూస్తున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తమకు వివాదాలు ఉండేవని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో అలా ఉండదని ఫడ్నవీస్ స్పష్టం చేశారు.

చిత్రం... ముంబయ పర్యటన అనంతరం మంగళవారం రాజధానికి చేరుకుని ర్యాలీలో మాట్లాడుతున్న కెసిఆర్