తెలంగాణ

రామయ్య పెళ్లికొడుకాయెనే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి బుధవారం వసంతమాడి పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు. ఏప్రిల్ 15వ తేదీన జరిగే కల్యాణానికి రాముడు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామికి వేడుకగా అభిషేకం చేసి వివిధ మంజీరాలతో వసంతోత్సవం చేశారు. అనంతరం స్వామిని పెళ్లికొడుకును చేశారు. శ్రీసీతారాముల కల్యాణం పెళ్లి పనులను లాంఛనంగా వైదిక కమిటీ ప్రారంభించింది. ముత్తయిదువులతో స్థానిక చిత్రకూట మండపంలో స్వామి వారి కల్యాణ తలంబ్రాలను కలిపారు. ముక్కాబులాలు, అత్తరు, పన్నీరు, కుంకుమ, పసుపుతో తలంబ్రాలను కలిపారు. ఇదిలావుండగా మణుగూరు మండలం సమితిసింగారం నుంచి భక్తులు పాదయాత్రగా భద్రాచలం వచ్చి శ్రీసీతారామచంద్రస్వామికి గోటితో తీసిన తలంబ్రాలను సమర్పించారు. అనంతరం స్వామికి డోలోత్సవం నిర్వహించారు. ఆస్థాన హరిదాసులు జోలలు ఆలపిస్తుండగా స్వామికి డోలోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామికి చల్లిన వసంతాలను భక్తులపై చల్లారు. దేవస్థానం సిబ్బంది కూడా వసంతోత్సవం సందర్భంగా రంగులు చల్లుకున్నారు. ఉత్సాహంగా ఉత్సవం జరిగింది. దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి ఆధ్వర్యంలో వేదపండితులు, సిబ్బంది పెళ్లి పనులు ప్రారంభించారు.