తెలంగాణ

బంగారు గని వాణిజ్య శాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ వాణిజ్య శాఖ ఆదాయం గణనీయంగా పెరగడంతో ఆ శాఖను, చెక్‌పోస్టులను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య శాఖ రాబడి రూ.33 వేల కోట్ల వరకు ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. 2014-15 ఆర్ధిక సంవత్సరంలో వ్యాట్, వాణిజ్య శాఖ పన్నులు కలిపి రూ. 22,834.54 కోట్లు, 2015-16 ఫిబ్రవరి వరకు రూ. 26,972.13 కోట్ల ఆదాయం వచ్చింది. ఇతర పన్నులతో కలుపుకుంటే గత ఏడాది రూ. 23,727.90 కోట్లు రాగా, ఈ ఏడాది మొత్తం ఆదాయం రూ. 30 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. 2015-16లో ఇంతవరకు వినోదపుపన్ను ద్వారా రూ. 99.37 కోట్లు, వృత్తిపన్ను 313.06 కోట్లు, విలాసపన్ను రూ. 87.15 కోట్లు, ఆర్‌డిఎస్ ద్వారా 301.14 కోట్లు, ప్రవేశపన్ను రూ. 32.95 కోట్లు, గుర్రపు పందాలు, జూదం పన్ను రూ. 62.88 కోట్లు సేకరించారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు ఏకీకృత చెక్ పోస్టులు, ఐదు సరిహద్దు చెక్ పోస్టులు ఉన్నాయి. కొత్తగా ఏడు సరిహద్దు చెక్ పోస్టులను ఇటీవల ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అంతర్గత పోస్టులు లేవు. ఏకీకృత చెక్ పోస్టులు నిజామాబాద్ జిల్లా సాలూరాలో, ఆదిలాబాద్‌లో బోరజ్‌లో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో లోపలకు లేక వెలుపలకు సరుకులను రవాణా చేసే వాణిజ్య సరుకుల వాహనాలన్నింటినీ రాకపోకలను నమోదు చేయడానికి, తనిఖీ చేయడానికి, స్మగ్లింగ్ పన్ను ఎగవేత మొదలైనప్పటి నుంచి కార్యకలాపాలకు పాల్పడుతూ రాష్ట్ర రాబడికి నష్టం కలిగిస్తున్న వాహనాలను గుర్తించడానికి , అంతరాష్ట్ర సరుకుల రవాణాలో రెవెన్యూ లీకేజిలను సమర్ధంగా అరికట్టేందుకు ఏకీకృత చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. సరకులను రవాణా చేసే వాహనాలకు సింగిల్ విండో తనిఖీ సౌకర్యాన్ని కల్పించేందుకు ఈ చెక్ పోస్టులు ఉపయోగపడుతాయి. మహారాష్ట్ర సరిహద్దు వద్ద భైంసా, వాంకిడి, మద్నూర్, కర్నాటక సరిహద్దు వద్ద చిరాగ్‌పల్లి, జహీరాబాద్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కొత్తగా ఆంధ్రపదేశ్ సరిహద్దుతో కోదాడ, విష్ణుపురం, నాగార్జున సాగర్, గద్వాల్ వద్ద తుంగభద్ర, ప్లావంచ, కల్లూరు (ముత్తూరు ఎక్స్ రోడ్డు), అశ్వరావుపేట వద్ద సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. వాణిజ్య శాఖను ఆధునీకరించేందుకు ఇ-రిజిస్ట్రేషన్లు, ఇ-రిటర్న్స్, ఇ-చెల్లింపు, ఇ-వే బిల్లులు వ్యవస్ధను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ ట్రాన్సిట్ పాస్‌ను పొందేందుకు ఇ-టిపి , కేంధ్ర డీలరు సర్వీసు కేంద్రం, వ్యాట్ 250 విధానాలను అమలు చేస్తున్నారు. వ్యాట్ డీలర్ల లావాదేవీలను నిర్వహించేందుకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లైయింలను పరిశీలించేందుకు, ఇన్‌వాయిస్ ట్రాకింగ్ సిస్టమ్‌ను వచ్చే ఆర్ధిక సంవత్సరం మే 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. సామర్ధ్య నిపుణులు, గణాంక విశే్లషణ, వ్యాపార ఇంటెలిజెన్స్ పరికరాలను వినియోగించడం ద్వారా ఆర్ధిక ఇంటెలిజెన్స్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

తెలంగాణ జెఏసిని బలోపేతం చేస్తాం

ప్రజాసమస్యలపై దృష్టి పెడతాం
వరంగల్‌లో నీటి ఎద్దడిపై వచ్చే వారం అధ్యయనం
ప్రొఫెసర్ కోదండరాం వెల్లడి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ పొలిటికల్ జెఏసిని త్వరలోనే గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. బుధవారం నగరంలోని జెఏసి ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన కోదండరాం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలిటికల్ జెఏసి త్వరలోనే ప్రజల్లోకి వెళ్లి ప్రజాసమస్యలపై పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా ప్రత్యేక పర్యటనలు, సమావేశాలు నిర్వహించి ప్రజా సమస్యలను నేరుగా పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే వారం వరంగల్ జిల్లాలో నెలకొన్న నీటి ఎద్దడిపై నేరుగా ప్రజల్లోకి వెళ్లి అధ్యయనం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నెలకొన్న పరిణామాలపై కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని ఆయన తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా పోలీసులు విశ్వవిద్యాలయంలో మోహరించారని, అక్కడి నుంచి వెంటనే పోలీసుల బలగాలను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హెచ్‌సియుకి కన్నయ్య వస్తున్నాడన్న సమాచారం తెలియటంతో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కోదండరాం అనుమానం వ్యక్తం చేశారు.