తెలంగాణ

మెట్రో రైల్వే స్టేషన్లలో ఠాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో మెట్రోరైలు భద్రతపై తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ అధికారులతో సమావేశమయ్యారు. డిజిపి కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది హాజరయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రోరైల్ మేనేజింగ్ డైరెక్టర్, సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు సివి ఆనంద్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో జరుగుతున్న మెట్రో పనులు, ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్య, రోడ్డు భద్రత వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా డిజిపి అనురాగ్ శర్మ మాట్లాడుతూ ప్రతి 22 రైల్వే స్టేషన్లకు ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. మహాత్మగాంధి బస్ స్టేషన్, జూబ్లి బస్‌స్టేషన్, పంజగుట్టలో రైల్వే పోలీస్ స్టేషన్లకు ప్రతిపాదనలు పంపుతున్నట్టు డిజిపి తెలిపారు. ఈ రైల్వే పోలీస్ స్టేషన్ల కోసం ఇద్దరు డిఎస్పీలు, ఇద్దరు ఏసిపిలు సహా 1525 సిబ్బంది అవసరమని ఆయన వివరించారు. వీటి నిర్వహణ కోసం రూ. 54 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్టు డిజిపి అనురాగ్ శర్మ చెప్పారు.
హెచ్‌సియు విసి ఇంటిపై దాడి కేసులో..
28 మంది అరెస్టు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 23: కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి అప్పారావు అధికార నివాసం దాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరు ఫ్యాకల్టీ సభ్యులు సహా 28 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హెచ్‌సియూలో మంగళవారం ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన అప్పారావును విద్యార్థులు వ్యతిరేకిస్తూ ఛాంబర్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, శ్రీకాంత్‌రెడ్డి అనే కానిస్టేబుల్ గాయపడిన విషయం తెలిసిందే. నిందితులపై 113/2016, యు/ఎస్ 147, 452, 427, 324, ఆర్/డబ్ల్యు 149 ఐపిసి సెక్షన్ 324, 353, 342 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా బుధవారం నిందితులను మియాపూర్ కోర్టులో హాజరు పరచగా కోర్టు వారికి రిమాండ్ విధించడంతో పోలీసులు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులు ఏ1, మాధవత్ వెంకటేశ్ (27) ఏ2, దొంత ప్రశాంత్ (26) ఏ3, బైకాని లింగస్వామి (30) ఏ4, మనె్న కృష్ణ (27) ఏ5, దుంగ హరీష్ (23) ఏ6, పేరం అమృతరావు(23) ఏ7, టి సేన్ గుప్తా (31) ఏ8, మున్సిఫ్ (22) ఏ9, ఇ రమేశ్ (22) ఏ10, తులసి అభిలాష్ (37) ఏ11, పి విజయ్ చౌదరి (25) ఏ12, శుభదీప్‌కుమార్ (30) ఏ13, ఉయ్యాల గౌతమ్ ( (26) ఏ14, మహమ్మద్ హసనుజ్జమన్ (24) ఏ15, శ్రీరాగ్ (26) ఏ16, దీపక్ సుదేవన్ (21) ఏ17, టి చక్రవర్తి (23) ఏ18, ఎండి షా (27) ఏ19, అవతార్‌సింగ్ (27) ఏ20, పి ఆదిత్యన్ (19) ఏ21, మాథివ్ జోసెఫ్ (22) ఏ22, రజత్ ఠాకూర్ (22) ఏ23, మహమ్మద్ అజ్మల్ (24) ఏ24, ఆశిఖ్ మహమూద్ (19) ఏ25, ఎన్ సుబ్బారావు (35) ఏ26, హృశికేశ్ కుంభార్ (25) ఏ27, కొండా ఏసురత్నం (53) ఉన్నారు.

మండుతున్న ఎండలతో జనం బెంబేలు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ తీవ్రమవుతున్న ఉష్ణోగ్రతలు
నిర్మాణ, వ్యవసాయ పనులకు బ్రేక్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 23: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా మారింది. కృష్ణా, చిత్తూరు, అనంతపురం, ఖమ్మం జిల్లాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. సీమలోని అన్ని జిల్లాల్లో బుధవారం పగటి అత్యధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదైంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఉత్తర కోస్తా, మధ్య కోస్తా జిల్లాల్లో 39 డిగ్రీల వరకు, దక్షిణ కోస్తా జిల్లాల్లో 40 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలను నమోదయ్యాయి.
సాధాణంగా ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు మే నెలలో పెరుగుతుంటాయి. గత పది సంవత్సరాల్లో పరిస్థితి పరిశీలిస్తే, మార్చి నెలలో 38 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత ఏనాడూ మించలేదు. ఏప్రిల్‌లో 38 నుండి 40 డిగ్రీల వరకు నమోదవుతూ వస్తోంది. ఒక్క మే నెలలోనే 40 డిగ్రీలు దాటి రికార్డవుతూ వస్తోంది. అయితే ఈ ఏడాది మార్చి నెలలోనే ఎండలు తీవ్రం కావడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. రెండు రాష్ట్రాల్లోనూ పరిస్థితి రోజు రోజు భయానకంగా మారుతోంది. ఏప్రిల్-మే నెలల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావణ శాఖ నిపుణులు భావిస్తున్నారు. ఎండలు పెరిగిపోతుండటంతో నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతోంది. తీవ్రమైన ఎండల వల్ల తలనొప్పి, జ్వరం తదితర అనారోగ్య పరిస్థితులకు గురవుతుండటంతో కూలీలు ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పంటపొలాల్లో ఉదయం 12 గంటలలోపే పనులను పూర్తి చేస్తున్నారు. అవసరమైతే సాయంత్రం నాలుగు తర్వాత మళ్లీ పనులు సాగిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద చేపట్టే పనులకు కూడా విఘాతం కలుగుతోంది. రోడ్డుపనులకు వెళ్లేందుకు కూలీలు వెనుకంజ వేస్తుండటంతో ఈ పనులు వేగంగా సాగడం లేదు. వడగాడ్పుల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకూడా జనం చనిపోతున్నారు. గత రెండు రోజుల నుండి ఈ పరిస్థితి ఏర్పడింది.