తెలంగాణ

ఏడాదిలో పోలీస్ ట్విన్ టవర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1:ఏడువందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే తెలంగాణ పోలీసు టవర్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవన నిర్మాణ పనులను ఈనెలాఖరు నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భవన నిర్మాణంపై మంగళవారం తన చాంబర్‌లో అధికారులతో సమావేశం అయ్యారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ మహేందర్‌రెడ్డి చీఫ్ ఇంజనీర్ గణపతిరెడ్డి సమీక్షలో పాల్గొన్నారు. భవన నిర్మాణ పనులు అనుభవం గల సంస్థకు అప్పగించి సకాలంలో పూర్తయ్యేట్టు చూడాలని నిర్ణయించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పోలీసు భవనాన్ని ఏడువందల కోట్ల రూపాయలతో నిర్మించనున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భవన నిర్మాణ కాంట్రాక్టర్‌కు అప్పగించే ముందు అంచనా, డిజైన్లు, అనుమతి మంజూరు వంటివన్నీ వారం రోజుల్లో పూర్తి కావాలని తుమ్మల తెలిపారు. పాలనా పరమైన సాంకేతిక అనుమతులు పదిహేను రోజుల్లో పూర్తి చేసి డిసెంబర్ చివరి నుంచి పనులు మొదలు పెట్టాలని మంత్రి తెలిపారు. ఈ భవనం ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం హబ్‌గా పని చేయాలని అన్నారు. ఈ భవనం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు నాడీ కేంద్రంగా పని చేస్తుందని తెలిపారు. ఆధునిక పోలీసు వ్యవస్థకు నూతన ఒరవడి సృష్టించే విధంగా భవన నిర్మాణం ఉండాలని అన్నారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు తెలంగాణ పోలీస్ టవర్ మణిహారంగా నిలుస్తుందని తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.