రాష్ట్రీయం

ప్రతి జిల్లాకు ఇద్దరు డిఇఓలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్కరణల్లో భాగంగా పాఠశాల విద్యలో ప్రతి జిల్లాకూ ఇద్దరు డిఇఓలను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు గరిష్టంగా 5వేల వరకూ ఉన్నాయి.
డిఇఓ హోదాలో రోజుకు రెండు మూడు స్కూళ్లను తనిఖీ చేసినా, జిల్లా అంతా కలిపి ఒక డిఇఓ నాలుగైదు వందల స్కూళ్లకు మించి తనిఖీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రతి రోజూ డిఇఓ తనిఖీ చేసినా కనీసం ప్రభుత్వ స్కూళ్ల తనిఖీ కూడా పూర్తికాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పరిపాలనకు ఒక డిఇఓను విద్యాత్మక అంశాలకు ఒక డిఇఓను నియమిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. 13 జిల్లాల్లో డిఇఓలకు తోడు చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, జాయింట్ డైరెక్టర్ పోస్టులను సృష్టించనుంది. ప్రస్తుతం నాలుగైదు జిల్లాలకు ఒక ఆర్‌జెడి ఉండగా, ఇక మీదట 13 జిల్లాలకు 13 మంది ఆర్‌జెడిలు వస్తారు. ఉమ్మడి సర్వీసు రూల్స్ వ్యవహారానికి పరిష్కారం దొరికితే సీనియార్టీ జాబితాలో ఉన్న హెడ్మాస్టర్లు అంతా డిప్యూటీ డిఇఓలు అవుతారు. డిఇఓలుగా ఉన్న వారు ఆర్‌జెడిలు కానున్నారు కనుక డిప్యూటీ డిఇఓలుగా ఉన్న వారంతా డిఇఓలుగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. తద్వారా స్కూల్ అసిస్టెంట్‌లు హెడ్మాస్టర్లుగానూ, ఎస్‌జిటిలు స్కూల్ అసిస్టెంట్లుగానూ పదోన్నతికి వీలుకలుగుతుంది. ఐదు మండలాలకు ఒక డిఇఓను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిప్యూటీ డిఇఓను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఈ ఆలోచనలపై ఇప్పటికే ముఖ్యకార్యదర్శి సిసోడియా, ఇతర సీనియర్ అధికారులు ఇటు ఉపాధ్యాయ సంఘాల నేతలతోనూ, ఆర్‌జెడిలతో అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనలపై పాఠశాల విద్య కమిషనర్ కె సంధ్యారాణి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపించారు.
రాష్టవ్య్రాప్తంగా 40329 ప్రాధమిక పాఠశాలలు, 9817 యుపి స్కూళ్లు, 10982 హైస్కూళ్లు ఉన్నాయి. మొత్తం స్కూళ్లు 61128 ఉన్నాయి. వాటిలో పనిచేసే టీచర్ల సంఖ్య చూస్తే 2,90,822 మంది ఉన్నారు.