రాష్ట్రీయం

ఏపి కొత్త సిఎస్ ఠక్కర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

30న కృష్ణారావు రిటైర్మెంట్
గవర్నర్‌ను కలిసిన సిఎస్

హైదరాబాద్, జనవరి 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ నెల 31వ తేదీన రిటైర్‌కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి పదవిపై ఆసక్తి చూపుతున్న సీనియర్ అధికారులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శనివారం నాడు సిఎస్ కృష్ణారావు గవర్నర్ నరసింహన్‌ను కలిసి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతోపాటు తన రిటైర్మెంట్ అంశాన్ని కూడా ప్రస్తావించినట్టు సమాచారం. అయితే కృష్ణారావు సేవలు అవసరమని భావిస్తున్న ప్రభుత్వం ఆయన సర్వీసు పొడిగింపునకు కేంద్రాన్ని కోరాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ కేంద్రం ఆయన సర్వీసులను పొడిగించిన పక్షంలో తక్షణం కొత్త చీఫ్ సెక్రటరీ ఎంపిక జరగకపోవచ్చు.
కృష్ణారావు తర్వాత సీనియర్ల జాబితాలో ఎస్‌పి ఠక్కర్ ఉన్నారు. ఆయన తర్వాత సి విశ్వనాథం, ఎన్ రమేష్‌కుమార్, లింగరాజు పాణిగ్రాహి, టి విజయకుమార్, ఎల్వీ సుబ్రహ్మణ్యం, అజేయకల్లాం, దినేష్‌కుమార్ ఉన్నారు. అయితే వీరిలో ఎల్వీ సుబ్రహ్మణ్యం మినహా తక్కినవారంతా ఒక నెల అటూ ఇటుగా వరుసగా రిటైర్ కానున్నారు. 79వ బ్యాచ్‌కు చెందిన ఆర్‌పి వతల్, ఐవి సుబ్బారావు కూడా రిటైర్ కానున్నారు. దాంతో 80వ బ్యాచ్‌కు చెందిన అశ్విని కుమార్ పరీడా, 81వ బ్యాచ్‌కు చెందిన చిర్రావూరి విశ్వనాథ్, సత్య ప్రకాశ్ ఠక్కర్, 82వ బ్యాచ్‌కు చెందిన రమేష్‌కుమార్ నిమ్మగడ్డ, లింగరాజు పాణిగ్రాహి, 83వ సంవత్సరం బ్యాచ్‌కు చెందిన టి విజయకుమార్ పోటీలో ఉన్నారు. వీరిలో ఠక్కర్‌కు సిఎస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు. (చిత్రం) శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వైఆర్, కృష్ణారావు