రాష్ట్రీయం

చెక్‌పోస్టుల ఆధునీకరణకు రూ.12కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి-మంత్రి తలసాని వెల్లడి
హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న చెక్‌పోస్టులను అభివృద్ధి చేసేందుకు రూ.12.03 కోట్లను కేటాయించినట్లు వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. శనివారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టిఆర్‌ఎస్ సభ్యులు హనుమంత్ షిండే, కోవాలక్ష్మి, గువ్వల బాలరాజు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ ఈ పనులు పూర్తి చేసేందుకు దాదాపు ఒక సంవత్సరం పడుతుందన్నారు. రాష్ట్రంలో సమగ్రభూసర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమ్మద్ మెహమూద్ అలీ చెప్పారు. టిఆర్‌ఎస్ సభ్యులు గోవర్ధన్ బాజిరెడ్డి, సిహెచ్ ధర్మారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ సమగ్ర భూసర్వే కోసం రూ.254 కోట్లు అవసరమన్నారు. ఎస్‌ఎల్‌ఆర్‌ఎంపి కింద కేంద్రం రూ.139 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ సర్వే వచ్చే ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమవుతుందన్నారు.