బిజినెస్

ఆంగ్లభాషా నైపుణ్యానికి ‘టాస్క్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్
హైదరాబాద్, జనవరి 2: నిరుద్యోగ యువతలో ఆంగ్లం, సాంకేతిక అంశాల్లో నైపుణ్య శిక్షణ అందించేందుకు తమ ప్రభుత్వం తెలంగాణ అకాడమి స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను ఏర్పాటు చేసి కృషి చేస్తోందని తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె తారకరామారావు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ తరహాలో 1,800 మంది యువతకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. తన శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న టాస్క్ పనితీరును శనివారం మంత్రి సంబంధిత అధికారులతో సమీక్షించారు. టాస్క్ సిఇఒ సుజీవ్ నాయర్ ఆ సంస్థ చేపట్టిన శిక్షణ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా వివరించారు. కాగా, సుమారు 10 వేల మందికి ఇంగ్లీషు భాషలో శిక్షణ ఇచ్చేందుకు టాస్క్ ప్రతినిధులు 198 కళాశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారని వివరించారు. సాఫ్ట్ స్కిల్స్‌లో 151 ఇంజినీరింగ్, ఎంసిఏ కళాశాలల్లోని 13 వేల మందికి స్వల్ప కాలిక శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసుకుని నిరుద్యోగులుగా ఉన్న పలువురు విద్యార్థులను వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్టు కింద 175 మంది యువతకు టాస్క్ శిక్షణ ఇస్తే 50 శాతం యువకులకు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కాయని ఆయన తెలిపారు.