బిజినెస్

అమెరికాలో అగ్రశ్రేణి సంస్థ టిసిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: భారత ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్).. అమెరికాలో వరుసగా రెండో ఏడాది అగ్రశ్రేణి సంస్థగా గుర్తింపును అందుకుంది. వ్యూహాత్మక నైపుణ్యం, ప్రణాళికాబద్ధమైన సిబ్బంది, సంస్థాగత నిర్వహణ, నేర్పరితనం, నిర్వహణాపరమైన పనితీరు, నాయకత్వ లక్షణాలు, కెరియర్, విజయవంతమైన యాజమాన్యం, సంస్కృతి అంశాల్లో టిసిఎస్ అసామాన్య ప్రదర్శన చూపించిందని ఎంప్లాయర్ సర్ట్ఫికేషన్ ఏజెన్సీ అయిన టాప్ ఎంప్లాయర్స్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. ‘అగ్రశ్రేణి సంస్థ కోసం జరిపిన అనే్వషణ.. టిసిఎస్ ఎంపికతో పూర్తయ్యింది. కీలకమైన 9 అంశాల ఆధారంగా టిసిఎస్‌కు ఈ గుర్తింపునిచ్చాం.’ అని టాప్ ఎంప్లాయర్స్ ఇనిస్టిట్యూట్ సిఇఒ డేవిడ్ ప్లింక్ తెలిపారు. ‘ప్రతిభ కలిగిన ఉద్యోగుల నూతన ఆలోచనలతో మా కస్టమర్లకు మేము ఉత్తమ సేవలను అందిస్తున్నాం. తాజా ఈ గుర్తింపు సంస్థకు మరింత ఉత్సాహన్నిస్తుంది.’ అని టిసిఎస్ ఉత్తర అమెరికా, బ్రిటన్, ఐరోపా విభాగాల అధ్యక్షుడు సూరీ కాంత్ అన్నారు. కాగా, టిసిఎస్ తర్వాత డిహెచ్‌ఎల్, సెయింట్ గోబెయిన్, బిఎస్‌హెచ్ హోమ్ అప్లియెనె్సస్ కార్పొరేషన్, చీజీ యుఎస్‌ఎ, డైమెన్షన్ డేటా, ఫౌరేషియా యుఎస్‌ఎ హోల్డింగ్స్, జెటి ఇంటర్నేషనల్ యుఎస్‌ఎ, ఆరెంజ్ బిజినెస్ సర్వీసెస్, టెక్నిప్ నార్త్ అమెరికా, వాలెయో యుఎస్‌ఎ తదితర సంస్థలూ అమెరికాలో అగ్రశ్రేణి సంస్థలుగా ఉన్నాయని టాప్ ఎంప్లాయర్స్ ఇనిస్టిట్యూట్ తెలిపింది.