తెలంగాణ

ఎయిమ్స్ తరహాలో ఆయుష్ ఇన్‌స్టిట్యూట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: ఎయిమ్స్ తరహాలో తెలంగాణకు సెంట్రల్ ఆయుష్ ఇన్‌స్టిట్యూట్‌ను మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. యునాని దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డలోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూనాని మెడిసిన్ విభాగం ఆవరణలో కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపద్ యశోనాయక్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ఆయుష్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, చార్మినార్ యూనాని ఆస్పత్రిని మెడికల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దబోతున్నామని, యునాని డిస్పెన్సరీలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి సామాన్యులు, ఉద్యోగులకు అందు బాటులోకి తీసుకొస్తామని చెప్పారు. మెరిట్ ప్రోగ్రామ్ కింద యునానీ వైద్య పరిశోధనా కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం సహాయం చేస్తుందన్నారు.
ఆర్థోపెడిక్ డాక్టర్స్ అసోసియేషన్ భేటీ
తెలంగాణ ఆర్థోపెడిక్ డాక్టర్స్ అసోసియేషన్ మీట్‌ను గాంధీ ఆస్పత్రిలో మంత్రి లక్ష్మారెడ్డి శనివారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజా వైద్యం ప్రజల మన్ననలు పొందే విధంగా కృషి చేస్తామని, ఏరియా, జిల్లా, టీచింగ్ ఆస్పత్రుల్లో ట్రామా సెంటర్స్‌ను ఆధునీకరించి, అన్ని జిల్లాల్లోనూ ఆర్థో ట్రామా సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అలాగే 108 సేవలను మరింత విస్తృతం చేస్తామని, ప్రమాదాలకు గురైన బాధితులకు సత్వర వైద్యం లభించేలా పోలీసులతో కలసి కృషి చేస్తామన్నారు. ఆర్థో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు విడిగా ప్రత్యేక పరీక్ష నిర్వహిం చడానికి కేంద్రంతో చర్చిస్తామని చెప్పారు.