రాష్ట్రీయం

జనచైతన్య యాత్ర బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెక్కల్లులో వీధికెక్కిన టిడిపి వర్గపోరు

తుళ్లూరు, డిసెంబర్ 7: తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ తీరును నిరసిస్తూ నెక్కల్లు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం జనచైతన్య యాత్రను బహిష్కరించారు. పార్టీకి అంకితభావంతో పనిచేసిన తమనుకాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆరోపించారు. సమస్యను చెప్పుకునేందుకు వెళితే మీరు ఎంపీ మనుషులంటూ ఎద్దేవా చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామంలో పనిచేయని కార్యదర్శిని మార్చమన్నా తమ గోడు పట్టించుకోవడం లేదని, మైనింగ్ అధికారులతో మాట్లాడి పోలు నర్సయ్య అనే వ్యక్తికి గ్రావెల్ అనుమతులు ఇప్పించారని, రావెల గోపాలకృష్ణ అనే వ్యక్తి ఎవరంటూ మండల నాయకులను నిలదీశారు. బుజ్జగించేందుకు ఎంపిపి పద్మలత, బెల్లంకొండ నరసింహారావు, ధనేకుల సుబ్బారావు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఇరువర్గాలను సమీకరించి ఈ నెల 14లోగా చైతన్యయాత్రను చేపడతామని హామీ ఇచ్చిన మండల పార్టీ అధ్యక్షుడు ధనేకుల వెంకట సుబ్బారావు యాత్రను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు ప్రకటించారు. దీంతో రావెల గోపాలకృష్ణ వర్గీయులు పార్టీ పతాకాన్నైనా ఆవిష్కరించాలని కోరారు. అందుకు సుబ్బారావు అంగీకరించక పోవడంతో 10వ వార్డు మెంబర్‌తో పార్టీ పతాకాన్ని ఆవిష్కరింపజేశారు.
అనంతవరంలోనూ నిరసన సెగ
అనంతవరం గ్రామంలోనూ తెలుగుదేశం పార్టీ నాయకులకు నిరసన సెగలు ఎదురయ్యాయి. పార్టీ కార్యక్రమాలను తమకు తెలియజేయడం లేదని, ఎమ్మెల్యే వద్దకు వెళితే మీరు మాజీ మంత్రి డొక్కా మనుషులంటూ వేరు చేస్తున్నారని సర్పంచ్ మేకల రాజేష్, కొమ్మినేని నరసింహస్వామి ఆరోపించారు. జనచైతన్య యాత్రలో పాల్గొనేందుకు నిరాకరించారు. దీంతో మిగిలినవారితో కలిసి దళితవాడలో యాత్రను కొనసాగించారు. స్థానికుల నుండి సమస్యలను ఎంపిపి వడ్లమూడి పద్మలత స్వయంగా తెలుసుకున్నారు. కార్యక్రమంలో ధనేకుల వెంకట సుబ్బారావు, దామినేని శ్రీనివాసరావు, అనుమోలు సత్యనారాయణ అప్పయ్య, తదితరులు పాల్గొన్నారు.