మహబూబ్‌నగర్

తెదేపా, కాంగ్రెస్ స్నేహ హస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకారంపై దృష్టి
* తెరాసను ఓడించేందుకు చెరో స్థానంలో పోటీకి సుముఖత
* బిజెపిని సైతం కలుపుకొని పోయేందుకు వ్యూహం
* రసవత్తరంగా మారిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
మహబూబ్‌నగర్, డిసెంబర్ 4: జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యుల్డ్ వెలువడడం దాంతో ఈ నెల 27వ తేదిన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు పోటీకి సమయత్తం అవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో అన్ని రాజకీయ పార్టీలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా జిల్లాలో తెరాసను ఒడించేందుకు విపక్షాలన్ని ఏకం కావాలని కూడా వ్యూహాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా రెండు స్థానాల్లో రెండు సీట్లకు పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ తరపున ఒక స్థానానికి టిడిపి తరపున మరో స్థానానికి పోటీ చేస్తే బాగుంటుందని ఇరువురు పార్టీల నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ అభ్యర్థిని ఒకరినే రంగంలోకి దింపాలని ఆ పార్టీ నేతలు ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. అభ్యర్థి విషయంలో కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మాజీ జడ్పి చైర్మన్ కుచుకుళ్ల దామోదర్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అదేవిధంగా మాజీ ఎంపి మల్లురవి కూడా పోటి చేసేందుకు పట్టుబడుతున్నట్లు సమాచారం. మరో ముగ్గురు నేతలు బుర్రి వెంకటరామరెడ్డి, శ్రీనివాస్‌గుప్త, జూపల్లి భాస్కర్‌రావులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. తెరాసను ఓడించాలంటే తెదేపా, బిజెపిలతో సమన్వయం చేసుకుంటేనే బాగుంటుందని కాంగ్రెస్ జిల్లా నేతలు కూడా బావిస్తున్నారు. టిడిపి విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి పేరును చంద్రబాబు నాయుడు సూచన ప్రాయంగా తెలిపినట్లు సమాచారం. దాదాపు దయాకర్‌రెడ్డి అభ్యర్థిగా ఉండొచ్చని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఒక స్థానానికి మాత్రమే పోటీ చేయాలని కూడా టిడిపి జిల్లా నేతలు సైతం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకటి కాంగ్రెస్‌కు, ఒకటి టిడిపికి అనే విధంగా ముందుకు వెళ్తే తెరాసను ఓడించేందుకు సులువైన మార్గం ఉంటుందని ఇరువురి పార్టీ నేతలు బావిస్తున్నారు. అందులో భాగంగానే చెరోస్థానంలోనే పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా జిల్లాలో బిజెపికి కూడా 107 స్థానిక ప్రజాప్రతినిధులు ఉండడంతో వీరి అవసరం ఎంతో ఉందని భావిస్తున్న కాంగ్రెస్ జిల్లా నేతలు వారిని కలుపుకుని పోవాలని కూడా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఎలాగు టిడిపితో పోత్తు ఉన్నందున ఇది వరకే టిడిపి అభ్యర్థికి అండగా ఉంటామని గత రెండు రోజుల క్రితమే టిడిపి జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు బిజెపి నేతలను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించిన సమయంలో బిజెపి నాయకులు టిడిపి నేతలకు బరోసా ఇచ్చి మద్దతు ప్రకటించారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా తమ స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదిస్తే తెరాసను ఓడించేందుకు సమన్వయంతో ముందుకు రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని బిజెపి నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఏది ఎమైనప్పటికిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసను ఓడించేందుకు తెదేపా, కాంగ్రెస్‌లు స్నేహ హస్తరాగం కనబరుస్తున్నట్లు తెలుస్తుంది.

వరంగల్ తరహాలోనే....
ఎమ్మెల్సీ ఎన్నికలోనూ ప్రతి పక్షాలకు చెంపపెట్టు తప్పదు
మహబూబ్‌నగర్, డిసెంబర్ 4: వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల తరహలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రతి పక్షాలకు చెంపపెట్టు తప్పదని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బి.శివకుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ శ్రీనివాస్‌గౌడ్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. రెండు స్థానాలను తప్పకుండా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టిడిపి నాయకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన గెలుపు మాత్రం జిల్లాలో టిఆర్‌ఎస్‌ను వరిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వారు తెరాసలో చేరుతున్నారని తాము ఎవరిని పార్టీలోకి బలవంతంగా లాక్కోవడంలేదని అన్నారు. ఇష్టం వచ్చిన వారు మాత్రమే టిఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని వారిని సాధరణంగా ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు. తమకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలకు సరిపడ్డ ప్రజా ప్రతినిధుల బలం ఉందని తప్పకుండా రెండు స్థానాలను గెలుచుకుంటామని తెలిపారు. కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు లోపాయికారికంగా ఒప్పందాలు కుదుర్చుకుని చెరోసీటు పోటీ చేసిన వారి ప్రయత్నాలన్ని శృంగభంగమేనని శివకుమార్ ఎద్దేవా చేశారు. జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపి అందరం కలిసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేయడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ఎంతమంది తెరాసలో ఇతర పార్టీల జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు చేరుతున్నారని శివకుమార్‌ను విలేఖరులు ప్రశ్నించగా చాలా మంది తెరాసలో చేరేందుకు క్యూలో ఉన్నారని కానీ రెండు స్థానాలను మాత్రం గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విలేఖరుల సమావేశంలో పార్టీ మాజీ జిల్లా కన్వీనర్ బెక్కం జనార్ధన్, పట్టణ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు శివరాజ్, పిల్లి సురేష్, కోట్ల కిషోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హరితహారం నల్లెరు మీద నడక
* మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్రమైన నీటికొరత * నర్సరీల్లోనే చెట్లుగా పెరుగుతున్న మొక్కలు
* ప్రత్యామ్నాయ చర్యలపై అటవీశాఖ అధికారుల మల్లగుల్లాలు * కంట్రోల్ వాటరింగ్ విధానానికి శ్రీకారం
మహబూబ్‌నగర్, డిసెంబర్ 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం జిల్లాలో నల్లెరు మీద నడకలా మారింది. ఈ ఏడాది వర్షాకాలంలో వరణుడు కరుణించకపోవడంతో జిల్లాలో తీవ్రమైన కరువు ఛాయలు ఏర్పడ్డాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించి అన్ని శాఖలను సమన్వయం చేసి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాది 5.60 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించారు. మొక్కలను పెంచేందుకు జిల్లాలో 562 నర్సరీలను ఏర్పాటు చేశారు. అచ్చంపేటలో 51, అలంపూర్‌లో 28, దేవరకద్ర 49, గద్వాల 35, జడ్చర్ల 38, కల్వకుర్తి 42, కొడంగల్ 46, కొల్లాపూర్ 40, మహబూబ్‌నగర్ 29, మక్తల్ 43, నాగర్‌కర్నూల్ 44, నారాయణపేట 41, షాద్‌నగర్ 30, వనపర్తి 40 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఈ నర్సరీల ద్వారా దాదాపు 5.60 కోట్ల మొక్కలను పెంచేందుకు శ్రీకారం చుట్టారు. అనుకున్న లక్ష్యానికి మొక్కలు మాత్రం పెంచారు. అయితే జిల్లాలో వరణుడు కరుణించకపోవడం వర్షాలు కురవకపోవడంతో అడపదడప కురిసిన వర్షానికి మాత్రమే కొంతమేర హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 1.40కోట్ల మొక్కలను నాటిన అధికారులు వాటిని సంరక్షించేందుకు ముప్పుతిప్పలు పడుతున్నారు. నాటిన మొక్కలను రెండేళ్లపాటు సంవృద్ధిగా నీరుపోసి పెంచి చెట్టుదశకు తీసుకురావాల్సిన భాద్యత ఉంది. అయితే జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడడంతో మొక్కలకు నీరు పోయడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. నాటిన మొక్కల సంగతి మొక్కలు ఎలా ఉన్నా...నర్సరీలలో పెంచుతున్న మొక్కల పరిస్థితులపై అటవీశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఓ పక్క నీటి కోరత, మొక్కలను రక్షించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. అయితే కొన్ని మొక్కలు నాలుగైదు నెలల వ్యవధిలోనే ఏపుగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం లక్షలాది మొక్కలు నర్సరీల్లో ఏపుగా పెరిగి చెట్టుదశకు చేరుకుంటున్నాయి. దాంతో ప్లాస్టిక్ కవర్లు చెరిగిపోతుండడం మొక్కకు సంబంధించిన వేర్లు బయటకు వస్తుండడంతో మొక్క ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అధికారులు దీనిని దృష్టిలో ఉంచుకుని కంట్రోల్ వాటరింగ్ విధానానికి శ్రీకారం చుడుతున్నారు. తక్కువ, ఎక్కువ కాకుండా మధ్యతరహలో నీటిని మొక్కలకు అందించే ప్రక్రియ చేపట్టారు. పెద్ద బ్యాగుల్లోకి ఏపుగా పెరిగిన మొక్కలను మార్చేందుకు అధికారులు సమయత్తం అవుతున్నారు.
నీటి కొరత ఉన్నప్పటికీ....
* డిఎఫ్‌ఓ రామమూర్తి
నర్సరీలలో మొక్కలను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏపుగా పెరిగిన మొక్కలను పెద్ద బ్యాగుల్లో మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు డిఎఫ్‌ఓ రామమూర్తి ఆంధ్రభూమి ప్రతినిధితో తెలిపారు. నర్సరీలలో ఏపుగా పెరిగిన మొక్కలపై వాటి సంరక్షణపై డిఎఫ్‌ఓ రామమూర్తిని వివరణ కోరగా ఈ ఏడాది 1.40కోట్ల మొక్కలను నాటడం జరిగిందని వాటంన్నింటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నర్సరీల్లో ఉన్న మొక్కలను కాపాడుతామని వచ్చే ఏడాదికి ఉపయోగిస్తామని కంట్రోల్ వాటరింగ్ విధానంతో మొక్కలను చూసుకుంటామన్నారు. వచ్చే ఏడు కూడా ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలను నాటాల్సి ఉండగా అందులో వీటిని కూడా ముందుగా వినియోగించుకునే అస్కారం ఉంటుందని, అదృష్టవశాత్తు ఈ పరిస్థితుల్లో అకాల వర్షాలు కురిస్తే ఈ సమయంలోనే మొత్తం మొక్కలను నాటుతామన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జాప్యం చేయొద్దు
మహబూబ్‌నగర్, డిసెంబర్ 4: అభివృద్ధి సంక్షేమ పథకాల ఆమలులో ఎలాంటి జాప్యం చేయోద్దని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి అన్నారు. శుక్రవారం జడ్పి సమావేశ మందిరంలో వనపర్తి డివిజన్ అబివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. ఇజిఎస్ ద్వారా పనులు కల్పించాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. సిటిజన్ చార్టర్ ప్రకారం నిబంధనలను పాటించాలని తెలిపారు. విధులలో ఆలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసరా పించన్ల లబ్దిదారుల వివరాలను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయాలని తెలిపారు. ఇంకా ఆధార్ కార్డు తీసుకోని లబ్దిదారులకు తప్పనిసరిగా మీ సేవ కేంద్రాల ద్వారా ఆధార్ కార్డులు ఇప్పించాలని తెలిపారు. వనపర్తి డివిజన్‌లో అంగన్‌వాడీ కేంద్రాల భవనాల నిర్మాణానికి భూమిని సత్వరమే గుర్తించాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో డంపింగ్ యార్డు ఉండాలన్నారు. వ్యక్తిగత మరుగుదోడ్లు వందశాతం నిర్మించుకునేలా ప్రజల్లో చైతన్యం తెచ్చి అందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఇంకుడు గుంతలు కూడా తీయించాలని అందుకు గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలన్నారు. పనికి ఆహార పథకం 150 రోజుల పని దినాలు పొడగించినందున ఆయా పనులను గుర్తించి కూలీలకు ఉపాధి కల్పించాలని తెలిపారు. వనపర్తి డివిజన్‌లో 2 లక్షలకుపైగా జాబ్‌కార్డులు జారీ చేయడం జరిగిందని పని అడిగిన ప్రతి ఉపాధి కూలీకి పనులు కల్పించాల్సిన భాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు మరుగుదోడ్లు పూర్తిస్థాయిలో నిర్మించుకునేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో డిపిఓ వెంకటేశ్వర్లు, జడ్పి సిఇఓ లక్ష్మీనారాయణ, డిఆర్‌డిఏ పిడి సోమశేఖర్‌రెడ్డి, డిఇఓ లక్ష్మీబాయి, డ్వామ పిడి దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో లోక్‌సత్తాకు ఉజ్వల భవిష్యత్తు
వనపర్తి, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ధీటైన పార్టీలోక్‌సత్తా పార్టేనని, రాబోయే కాలంలో లోక్‌సత్తా పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని లోక్‌సత్తా జాతీయ అద్యక్షులు సురేంద్ర శ్రీవత్సవ అన్నారు. శుక్రవారం వనపర్తిలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంత కాలంగా ప్రతి జిల్లాకు తిరిగి లోక్‌సత్తా పార్టీ నేతలను, కార్యకర్తలను కలిసి పార్టీ పటిష్టతకు కృషిచేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో కనీసం 10 ఎమ్మెల్యే సీట్లు, 1ఎంపి సీట్లు సాధించేందుకు కృషిచేస్తున్నామని అన్నారు. కేసి ఆర్ హామీలకే పరిమితమయ్యారని, వాటిని నెరవేర్చడంపై దృష్టి సారించడం లేదని ఆయన విమర్శించారు. నేతిబీరకాయలో నెయ్యి ఎంత ఉందో కేసిఆర్ హామీల్లో అమలు అంతే ఉందని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషిచేయకుండా ఛండీయాగమంటూ తిరుగుతున్నారని ఆయన అన్నారు. తుఫాను ముందు ప్రశాంతత లాగా లోక్‌సత్తా వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతుందని అయన అన్నారు. అద్భుత భావజాలం గల లోక్‌సత్తా పార్టీ వైపుకు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని ఆయన అన్నారు.టిడిపి, కాంగ్రెస్, బిజెపి పార్టీలు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని, జిహెచ్‌యంసి ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీలో మొదటి మెట్టు ఎక్కుతుందని అన్నారు. తెలంగాణ కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారని, ఎన్నికల ముందు లక్ష ఉద్యోగాలు ప్రకటించిన కేసి ఆర్ కేవలం నాలుగు ఉద్యోగాలు మాత్రమే భర్తీచేశారని ఎద్దేవాచేశారు. 1ముఖ్యమంత్రి పదవి తనకు, కుమార్తెకు ఎంపి పదవి, అల్లుడికి, కుమారుడికి మంత్రి పదవులు కట్టబెట్టారని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని, వెంటనే రైతుల పక్షాన నిలిచి ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు. మంత్రిహరీష్‌రావు తన నియోజకవర్గంలో రైతులు మృతిచెందితే కనీసం వారి కుటుంబాలను కూడా పరామర్శించలేదని అన్నారు. హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు ముఖ్యమంత్రి డబ్బులు మంజూరుచేస్తున్నారని, ప్రజలకు కావాల్సినవి సంక్షేమ పథకాలని ఆయన అన్నారు. ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగును ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. ఈసమావేశంలో రాష్ట్ర అద్యక్షులు పాండురంగారావు, జిల్లా కన్వీనర్ రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కార్యవర్గం ఏర్పాటు
లోక్‌సత్తా పాలమూరుజిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం జాతీయ అధ్యక్షుడు సురేంద్ర శ్రీవత్సవ ప్రకటించారు. అధ్యక్షుడిగా రామచంద్రుడు, ప్రధాన కార్యదర్శిగా లోధ్యాబీక్యా, ఉపాధ్యక్షుడిగా ఈశ్వరమ్మ, కోశాధికారిగా వెంకటాచారి, అధికార ప్రతినిధిగా రాఘవేంద్ర, సూర్యనాయక్, నిరంజన్‌గౌడ్, రుద్రగౌడ్, రమేష్‌నాయక్‌లను ఎన్నుకున్నట్లు తెలిపారు.

అక్రమ బదిలీలకు నిరసనగా...
డిఇ కార్యాలయం ఎదుట ఉద్యోగుల ధర్నా
గద్వాల, డిసెంబర్ 4: గద్వాల డివిజన్ పరిధిలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల్లో అక్రమ బదిలీలు జరిగాయంటూ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం డిఇ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హుస్సేన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అక్రమ బదిలీలు చేపట్టి అన్యాయం చేశారన్నారు. ఈ విషయంపై పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా స్పందించిన దాఖలాలు లేవన్నారు. దీనిపై డిఇఇ శ్రీనివాసులకు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. డిఇఇ సెలవులపై వెళుతూ బదిలీలపై దృష్టి సారించడం లేదన్నారు. అక్రమ బదిలీలను నిలుపుదల చేసేంత వరకు నిరసన కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల డివిజన్ కార్యదర్శి చంద్రవౌలి, అధ్యక్షుడు జైపాల్, వనపర్తి డివిజన్ అధ్యక్షుడు వెంకటస్వామి, కార్యదర్శి దయానందం తదితరులు పాల్గొన్నారు.

గద్వాల జిల్లా ఇచ్చుడో.. నడిగడ్డలో టిఆర్‌ఎస్ సచ్చుడో!
* ఉద్యమానికి కలిసిరాని వారిని ద్రోహులుగా పరిగణించాలి * మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి
గద్వాల, డిసెంబర్ 4: నడిగడ్డలోని గద్వాల ప్రాంతానికి జిల్లా కేంద్రం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, 60 ఏళ్ల పాటు వెనుకబడిన నడిగడ్డను అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు జిల్లా కేంద్రం ఏర్పాటు ఎంతో అవసరమన్నారు.గద్వాలను జిల్లాగా ఇచ్చుడో.. నడిగడ్డలో టిఆర్‌ఎస్ సచ్చుడో తేలిపోవాలని గద్వాల మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ గడ్డంకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం గద్వాల మండలంలోని బీరెల్లి, గోనుపాడు, ధరూరు మండలంలోని ఓబులోనిపల్లి, బూరెడ్డిపల్లి గ్రామాల్లో ఒక రోజు నిరాహార దీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీరెల్లి దీక్షా శిబిరంలో గడ్డంకృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రం ఏర్పాటు ఈ ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు, అన్నివర్గాల ప్రజలకు ఎంతో మేలని, ఇలాంటి విషయంలో చేస్తున్న ఉద్యమాలకు కలిసిరాని పార్టీలను నాయకులను ఈ ప్రాంత ద్రోహులుగా చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా నడిగడ్డ ప్రాంతం త్యాగాలకు పేరెన్నికగన్నదని ఈ ప్రాంత రైతులు భూములు, ఇండ్లు కోల్పోయి జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నారని, ఇలాంటి ప్రజల రుణం తీర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అదేవిధంగా రాజకీయ కోణాల్లో చూడకుండా అన్నివర్గాల ప్రజల ఆకాంక్ష మేరకు ప్రతి ఒక్కరు ఉద్యమంలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణారెడ్డి, బీసన్న, బూరెడ్డిపల్లి గోపాల్, మహేంధర్‌రెడ్డి, గోవర్ధన్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

మలుపులు తిరుగుతున్న ‘్భ కుంభకోణం’
కొందుర్గు, డిసెంబర్ 4: నకిలీ పత్రాలను సృష్టించి కోట్లాది రూపాయల విలువ గల భూమిని కాజేయడానికి ప్రయత్నించిన ఘటన రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించి కొందుర్గు తహశీల్దార్ రోజుకో మాట మాట్లాడుతుండటంతో అటు రైతులు..ఇటు ఉన్నతాధికారులకు అనేక సందేహాలకు తావిస్తుంది. ఈ కుంభకోణంలో గతంలో తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసిన సిబ్బంది హస్తం ఉందని ప్రాథమికంగా గుర్తించినప్పటికి అధికారికంగా ఎలాంటి చర్యలు చేపట్టకపోగా సరిదిద్దుతామంటూ ఏకంగా తహశీల్దారే ప్రకటిస్తుండటం..ఈ ఘటనలో రెవిన్యూ శాఖ సిబ్బంది హస్తం ఉందని పరోక్షంగా అంగీకరించినట్లు అవుతుంది. కొందుర్గు మండలం శ్రీరంగాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 95, 96లలో ప్రైవేట్ భూమితో పాటు సర్వే నంబర్ 74లోని ప్రభుత్వ భూమిని కాజేసేందుకు నకిలీ పత్రాలను సృష్టించిన సంఘటనను ‘ఆంధ్రభూమి’ వెలుగులోకి తీసుకురావడంతో అటు అధికారుల్లోను..ఇటు ప్రజల్లోను సంచలనం రెకేత్తిస్తుంది. దీనికి తోడు ఈ ఉదంతంలో గతంలో పనిచేసిన రెవిన్యూ సిబ్బంది హస్తం ఉన్నట్లుగా అధికారులు భావిస్తుండటంతో ఈ భూ కుంభకోణంపై విచారణ జరిపితే ఇంకా ఏమైన కుంభకోణాలు వెలుగు చూస్తాయా అనే అనుమానాలు సైతం కలుగుతున్నాయి. కాగా కొందుర్గు తహశీల్దార్ జె.పాండు ఈ ఘటనకు తమ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదంటూ నేడు మాట మార్చాడు. ఈ ఘటనలో తమ కార్యాలయ సిబ్బంది 2009-2010సంవత్సరంలో పోరపాటు చేశారని, దీన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతే తప్పా ఈ ఘటనకు బాధ్యులైన వారిపై సహకరించిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మాత్రం అనడం లేదు. కాగా ఈ సంఘటనలో తమకు న్యాయం కలుగాలంటూ బాధిత రైతులు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ కుంభకోణంపై విచారణ జరిపితే మరిన్నీ ఘటనలు వెలుగుచూసే అవకాశం ఉందంటూ స్థానిక ప్రజలు భావిస్తున్నారు.
తప్పు జరిగింది..రికార్డులు సరి దిద్దుతాం
కొందుర్గు తహశీల్దార్ జె.పాండు
భూ కుంభకోణం విషయంలో తప్పు జరిగిందని..రికార్డులను సరిదిద్దడానికి చర్యలు తీసుకుంటామని కొందుర్గు తహశీల్దార్ జె.పాండు శుక్రవారం తెలిపారు. కొందుర్గు మండలం శ్రీరంగాపూర్ గ్రామంలోని భూముల రికార్డుల తారుమారు విషయంలో 2009-2010సంవత్సరంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది చేసిన తప్పు వల్లే ఇది చోటు చేసుకుందని అన్నారు. ఈ భూముల విషయంలో అప్పుడు పనిచేసిన సిబ్బంది రికార్డులను తారుమారు చేశారన్నారు. కాగా ఈ సంఘటనపై తనకు ఎలాంటి సంబంధం లేదని, గతంలో 2009-2010వ సంవత్సరంలో చోటు చేసుకుందని, అప్పటి అధికారులు దీనిపై విచారణ జరిపారని కానీ పెండింగ్‌లో ఉందని తహశీల్దార్ పాండు తెలిపారు.
దీనిపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తున్నామని, రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

ఎంపిటిసిలు, కౌన్సిలర్లు
చేజారకుండా అప్రమత్తమైన పార్టీల నేతలు
* బేరసారాలకు రంగం సిద్ద్ధం
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 4: ఈనెల చివర్లో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లుగా ఉన్న వారు పార్టీ నుంచి చేజారకుండా ఉండేందుకై ఆయా పార్టీల ముఖ్య నేతలు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు కాకముందే ఆయా పార్టీల నేతలు తమపార్టీకి చెందిన ఎంపిటిసిలు, కౌన్సిలర్లు వేరేపార్టీవైపు మొగ్గు చూపకుండా ఉండేందుకు వీలుగా మండలాల వారిగా పార్టీ సీనియర్ నాయకులకు అప్పగించినట్లు తెలిసింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టిఆర్‌ఎస్ పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీల నేతలు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆయా పార్టీలకు చెందిన ఎంపిటిసిలు, కౌన్సిలర్లతో టచ్‌లో ఉంటూ వారి కోరికలను తీర్చేందుకు సిద్దమేనని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నేతలు ప్రతిపక్షాలకు చెందిన ఎంపిటిసిలను, కౌన్సిలర్లను తమవైపు తిప్పుకునేందుకు అప్పుడే తాయిలాలు ప్రకటిస్తున్నట్లు తెలిసింది. పార్టీలోనే ఉంటూ టిఆర్‌ఎస్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తే ఒక రేటు, పార్టీలోనే చేరితే మంచి భవిషత్ ఉంటుందని, ప్రభుత్వపరంగా పనులు ఇవ్వడంతోపాటు కొంత నగదుకూడా ఇస్తామని ఎరవేస్తున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సైతం అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఎంపిటిసిలను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మొత్తంమీద అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారే ఎక్కువగా ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, కౌన్సిలర్లు ఉండటంతో ఆయా పార్టీలకు చెందిన నేతలు తమ వైపునుంచి జారకుండా ఉండేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారు. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో బిజెపి, టిడిపిలకు చెందిన వారు తక్కువ మంది ఉండటంతో వారినికూడా తమవైపుకు తిప్పుకునేందుకు అటు టిఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బిజెపి, టిడిపికి చెందిన ఎంపిటిసిలు అధికార టిఆర్‌ఎస్‌లో చేరగా, మిగతా వారిని కూడా చేర్చుకునేందుకు టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఖరారైన తరువాత పెద్ద ఎత్తున బేరసారాలకు దిగే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.