గుంటూరు

మంగళగిరి అమరావతి టౌన్‌షిప్‌లో తాత్కాలిక సచివాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 27: రాజధాని అమరావతికి హైదరాబాదు సచివాలయం ఉద్యోగులంతా ఆర్నెళ్లలోపు తరలిరావాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడమే కాకుండా తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి వేగంగా ముందుకెళ్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని అమరావతి టౌన్‌షిప్‌లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించేందుకు త్వరలో టెండర్లను ఆహ్వానించనుంది. సుమారు 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తుల భవన సముదాయాలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంగళగిరికి రెండు కీలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి టౌన్‌షిప్ రాకపోకలు సాగించేందుకు అన్నిరకాల మార్గాలున్న దృష్ట్యా తాత్కాలిక సచివాలయానికి యోగ్యంగా ఉంటుందని ప్రభుత్వం తొలి నుంచి భావిస్తోంది. రాజధాని ప్రాంతంగా తుళ్లూరును ప్రకటించిన మరుక్షణం నుంచి అమరావతి టౌన్‌షిప్‌లో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి పూనుకోవాలని, పలుమార్లు నిర్ణయం తీసుకుంది. సుమారు 200 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని భావించి వెనక్కుతగ్గిన ప్రభుత్వం మరలా నిర్మాణాలకు పూనుకోనుంది. ఇప్పటికే సచివాలయం ఉద్యోగులకు మూడు ఆప్షన్లను ఇచ్చి బదిలీలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా తాత్కాలిక సచివాలయ నిర్మాణం అత్యవసరమైనందున జనవరిలో టెండర్లను పిలవనుంది. మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణదశలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడికి సమీపంలో గల 102 ఎకరాల స్థలంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి స్థలాన్ని సిఆర్‌డిఎ అధికారులు గుర్తించారు.