తెలంగాణ

తెలంగాణ నీటికష్టాలకు గత పాలకులే కారణం: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గత పాలకుల నిర్లక్ష్య వైఖరి వల్లే నేడు తెలంగాణలో సాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయని సిఎం కెసిఆర్ గురువారం అసెంబ్లీ సమావేశంలో అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక అనుసరిస్తున్న విధానాల వల్ల తెలంగాణకు సమృద్ధిగా నీరు అందడం లేదన్నారు. మహారాష్టల్రో గోదావరిపై ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నందున తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు అన్యాయం జరుగుతోందన్నారు. మహారాష్టల్రో ప్రాజెక్టులు నిండాకే తెలంగాణకు నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టు కడతామంటేనే వివాదం అవుతోందన్నారు. గోదావరి, కృష్ణా జలాల్లో తగినంత వాటా లభిస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. నీటి వాటా కోసం పొరుగు రాష్ట్రాలను ప్రశ్నిస్తే ప్రతీదీ వివాదం అవుతోందన్నారు. నీటి విషయంలో అనాదిగా జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేస్తూ, తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీటిని అందించడమే తమ సర్కారు ధ్యేయమని కెసిఆర్ అన్నారు.