రాష్ట్రీయం

తిరుమలలో పెరుగుతున్న రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో మూడు రోజులు విఐపి దర్శనాలు రద్దు
తిరుమల, డిసెంబర్ 24 : మిలాద్ ఉన్ నబి, క్రిస్మస్, వారాంతపు సెలవులు వరుసగా రావడంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. గురువారం ఉదయం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 45,822 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. మరో 30 వేల మందికి పైగా భక్తులు స్వామి దర్శనం కోసం వేచివున్నారు. దీంతో సర్వదర్శనం వెళ్ళే భక్తులకు 10 గంటల సమయం పడుతుండగా కాలినడకన వెళ్లే భక్తులకు 7 గంటల సమయం పడుతూ ఉంది. తమిళనాడులో జనవరి 2 వరకు సెలవులు ఉండడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
నేడు పౌర్ణమి గరుడ సేవ
ప్రతి నెల పౌర్ణమి నాడు తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను టిటిడి నిర్వహించనుంది. శుక్రవారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ స్వామివారు మాడ వీధుల్లో గరుడవాహనంపై తిరుగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.