రాష్ట్రీయం

సివిల్స్‌లో తెలుగు టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫస్ట్ ర్యాంకర్‌గా కర్నాటకవాసి నందిని టాప్ 10లో ఇద్దరు తెలుగు అభ్యర్థులుఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 31: సివిల్ సర్వీసెస్ -2016 పరీక్ష ఫలితాలను బుధవారం రాత్రి యుపిఎస్‌సి విడుదల చేసింది. జాతీయస్థాయిలో తెలుగువాడు రోణంకి గోపాలకృష్ణ మూడోస్థానంలో నిలిచాడు. టాప్ 10లో ఇద్దరు తెలుగు వారుండటం విశేషం. తెలుగు మీడియంలో పరీక్షరాసి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన గోపాలకృష్ణను అంతా అభినందిస్తున్నారు. ఆయనతోపాటు టాప్ 500 ర్యాంకుల్లో చాలా మంది తెలుగువారు ర్యాంకులు సాధించారు. గతంలో ఎన్నడూలేని విధంగా తెలుగువారు తమ సత్తా చూపారు. సివిల్స్ ఎంపిక జాబితాలో కర్నాటకకు చెందిన కెఆర్ నందిని మొదటి స్థానంలో నిలవగా, అన్మోల్ షేర్ సింగ్ బేడీ రెండోస్థానంలో, రోణంకి మూడో స్థానంలో నిలిచాడు. మొత్తం 1099మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. టాప్ 10 ర్యాంకుల్లో ముగ్గురు అమ్మాయిలున్నారు. ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్, కేంద్ర సర్వీసులు, గ్రూప్-ఎ, గ్రూప్-బి సర్వీసులకూ వీరు ఎంపికయ్యారు. 500మంది జనరల్ కేటగిరిలో ఎంపికకాగా, 347మంది ఒబిసి, 163మంది ఎస్సీ, 89మంది ఎస్టీ విభాగాల్లో ఎంపికయ్యారు. టాప్ 10 ర్యాంకర్లలో వరుసగా నందిని కెఆర్, అన్మోల్ షేర్ సింగ్ బేడీ, గోపాలకృష్ణ రోణంకి, సౌమ్య పాండే, అభిలాష్ మిశ్రా, కొత్తమాసు దినేష్‌కుమార్, ఆనంద్ వర్ధన్, శే్వతా చౌహన్, సుమన్ సౌరభ్ మహంతి, బిలాల్ మొహిద్దీన్ భట్‌లు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల నుండి ఇంతవరకూ అందిన సమాచారం ప్రకారం రోణంకి గోపాలకృష్ణ (3), కొత్తమాను దినేష్‌కుమార్ (6), సీనియర్ ఐపిఎస్ అధికారి (రిటైర్డ్) ఎకె ఖాన్ కుమారుడు మజమ్మిల్ ఖాన్ (22), మణి చౌదరి (36), పి అనే్వషారెడ్డి (80), సురుచి చౌదరి (152), కర్నాటి వరుణ్‌రెడ్డి (166), మల్లవరపు బాలలత (167), బిందుమాధవ్ గరికపాటి (172), వరుణ్ చౌదరి (281), జి పవన్‌కుమార్‌రెడ్డి (353), మెరువ సునీల్ కుమార్‌రెడ్డి (354), ఉప్పులూరి మీన (355), వీరేపల్లి విద్యాధర్ (487), అవతపల్లి అవినాష్ (502), తక్కెళ్లపల్లి యశ్వంత్‌రావు (531), సునీతా చౌదరి (862) మంచి ర్యాంకులు సాధించిన వారిలో ఉన్నారు.
తెలుగుమీడియంలో చదివా: గోపాలకృష్ణ
తెలుగు మీడియంలోనే చదివినా సివిల్స్‌లో ఎంపిక కావడం ఆనందంగా ఉందని గోపాలకృష్ణ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పలాసా మండలానికి చెందిన గోపాలకృష్ణ చదువు దూరవిద్యలోనూ కొనసాగించినట్టు పేర్కొన్నారు. గోపాలకృష్ణ విజయంపై మంత్రి కె అచ్చన్నాయుడు అభినందనలు తెలిపారు. మొత్తం తన చదువంతా ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగిందని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు పెద్దగా చదువుకోకపోయినా సహచరులు, ఉపాధ్యాయుల సహకారంతో ఈ విజయం సాధించినట్టు చెప్పారు. నిరంతర కృషి తనను ఈ స్థానానికి తీసుకొచ్చిందన్నారు.
రెండో ప్రయత్నంలో..
పలాస: సాధారణ రైతు కొడుకు సివిల్స్‌లో మూడో ర్యాంక్ సాధించి శ్రీకాకుళం జిల్లా పేరు నిలబెట్టాడు. పలాస అర్బన్ పరిధిలోని పారసంబకు చెందిన రోణంకి గోపాలకృష్ణ (29) బుధవారం యుపిఎస్‌సి ప్రకటించిన 2016 సివిల్స్ ఫలితాల్లో మూడో ర్యాంక్ సాధించాడు. తల్లిదండ్రులు రోణంకి అప్పారావు, రుక్మిణమ్మ రైతు కుటుంబానికి చెందిన వారు. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూనే గోపాలకృష్ణ టీచర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే సివిల్స్ లక్ష్యంగా చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవుపెట్టి హైదరాబాద్‌లో సివిల్స్ కోచింగ్ తీసుకుని అనుకున్నది సాధించాడు. కొడుకు సాధించిన ఘనతతో తామెంతో ఆనందపడుతున్నామని గోపాలకృష్ణ తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది పెళ్లి చేసే ఉద్దేశంతో ఇంటికి రమ్మన్నా రాలేదని, చివరకు అనుకున్నది సాధించాడని ఆనందం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణ ఐఏఎస్ అవుతున్నాడని తెలిసి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే గోపాలకృష్ణ గ్రూప్-1, 2కూ ఎంపికయ్యాడని తల్లిదండ్రులు తెలిపారు. వీటిని కాదని, ఐఏఎస్ లక్ష్యంగా రెండో ప్రయత్నంలో అనుకున్నది సాధించాడన్నారు.