రాష్ట్రీయం

స్ర్తిల ఉపాధి అవకాశాలకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి గంటా సుబ్బారావు

హైదరాబాద్, నవంబర్ 30: ఉపాధి కోసం నైపుణ్యంతో గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి అవకాశాలు బాగున్నాయని, నైపుణ్యం లేకుండా వెళ్లేవారికి ఇబ్బందులున్నాయని ఎపి స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంటా సుబ్బారావు పేర్కొన్నారు. యుఎన్ ఉమన్ , ఎపిఎస్‌ఎస్‌డిసిల సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మూడు రోజుల సదస్సు ప్రారంభకార్యక్రమంలో గంటా సుబ్బారావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఉన్న నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ మార్గదర్శనంలోనే ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ‘లింగ వివక్ష-వలస-అభివృద్ధి: హక్కులు’ అనే అంశంపై ఈ సదస్సు విస్తృతంగా చర్చించనుంది. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కె. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతమైన అభివృద్ధి, సంక్షేమంతో పాటు రెండంకెల వృద్ధి లక్ష్యంగా పరుగులు తీస్తోందని అన్నారు. సదస్సులో వివిధ శాఖల ప్రతినిధులు, కార్మికశాఖలో వలసల నిర్వహణా విభాగం, దేశాంతర వలసల్లో స్ర్తిశక్తి సంఘటన అంశాల్లో తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. యుఎన్ ఉమెన్ ఆఫీసు డిప్యూటీ ప్రతినిధి పాట్రికా బరాండన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఈ శిక్షణలో ప్రధానంగా వలసల నియంత్రణా యంత్రాంగాన్ని రూపొందించుకోవటం, సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సాక్ష్యాలు ఉండేట్లు చూసుకోవటం, విధాన రూపకల్పన, వీటిలో ఎవరి జోక్యం ఎప్పుడు ఉండాలి అనేది స్పష్టత... అనే అంశాలుంటాయని గంటా సుబ్బారావు పేర్కొన్నారు. అసంఘటిత రంగంలో విదేశాల్లో సేవలందించడానికి వలసలు వెళ్లేవారికి సంబంధించిన నియమ నిబంధనల విషయంలో భారతదేశంలో ఇప్పటివరకు ఒక సమగ్రమైన విధానమంటూ లేదని, దీనివలన వలస వెళ్లిన మహిళలు అనేక సమస్యల్లో చిక్కుకున్నప్పుడు పరిష్కారాలు, వీరిని విదేశాలకు పంపే బ్రోకర్ల దయాదాక్షిణ్యాలకు వదిలివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. దీనివల్ల పలుమార్లు పరిస్థితి జఠిలంగా మారుతోందని, ఏది ఏమైనా వలస కార్మికుల్లో అట్టడుగు శ్రేణుల సమస్యలు ఎప్పటికీ కూడా అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాయని చెప్పారు.