రాష్ట్రీయం

శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 24: శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. జిల్లా కేంద్రంలోని గుజరాతీపేట, పిఎన్ కాలనీ, పాలకొండరోడ్డు, సీపన్నాయుడుపేట ప్రాంతాలతోపాటు, పొందూరు, ఎచ్చెర్ల, జి సిగడాం, లావేరు, జి సిగడాం మండలాల్లో సాయంత్రం 5.55 గంటలకు నాలుగు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. ఉన్నట్టుండి భూమి కంపించడంతో స్థానికులు భయంతో ఇళ్ళ నుంచి పరుగులు తీసారు. అలాగే కార్యాలయాల్లో కుర్చీలు, బెంచీలు ఊగిపోవటంతో సిబ్బంది రోడ్డుపైకి పరుగులు తీశారు.