తెలంగాణ

టిఆర్‌ఎస్‌కు బెదరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: టిఆర్‌ఎస్ ఎత్తులకు, జిత్తులకు, బెదిరింపులకు తాము బెదరమని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచార రథాలను ఆయన పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు బిజెపి-టిడిపిలకు పట్టం కడితే ఉగ్రవాదం నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పిస్తామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఉగ్రవాదం ఆటంకం కలిగిస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీ ఉగ్రవాదానికి మద్దతుగా పని చేస్తున్నదని, అటువంటి మజ్లిస్‌కు టిఆర్‌ఎస్ తోడ్పాటు అందిస్తున్నదని ఆయన విమర్శించారు. ఉగ్రవాదుల కుట్రలను కేంద్ర ప్రభుత్వం భగ్నం చేసిందని ఆయన తెలిపారు. టిడిపి-బిజెపి గ్రేటర్‌లో విజయం సాధిస్తే హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం పట్ల దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను మహిళలకు ఉపాధి కేంద్రంగా మారుస్తామని ఆయన అన్నారు.పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీ పార్టీలో ఉన్నారా? లేరా? అని ప్రశ్నించగా, ఆయన విషయంలో ఆలోచన చేస్తున్నామని, విధానపరమైన ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని దత్తాత్రేయ తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వివాదం గురించి ప్రశ్నించగా, ఆయన సమాధానం ఇవ్వకుండా విలేఖరుల సమావేశాన్ని ముగించారు.