తెలంగాణ

హెల్త్, అక్రిడిటేషన్ కార్డుల కోసం జర్నలిస్టుల నిరశన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేనిపక్షంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నేతలు హెచ్చరించారు. హెల్త్ కార్డులను జారీ చేయకపోవడం వల్ల వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమతలేక అనేక మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పొతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడిటేషభ్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం టియుడబ్ల్యుజె, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యుజె) అధ్వర్యంలో సమాచారశాఖ కార్యాలయం ఎదుట నిరహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజెయు నాయకులు కె శ్రీనివాస్‌రెడ్డి, దేవులపల్లి అమర్, కె అమర్‌నాథ్ మాట్లాడుతూ, మీడియా రంగంలో పనిచేసేవారందరికీ అక్రిడిటేషన్లు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోయే దశలో కూడా ఆంధ్ర నాయకత్వంలోనే జర్నలిస్టుల యూనియన్ పని చేస్తుందా? అని ఉద్యమ నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ విమర్శించారని వారు గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటికీ అక్రిడిటేషన్ కార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రించినవే కొనసాగే దుస్థితి ఎందుకు వచ్చిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసిందని, మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు జారీ చేయలేకపోతుందని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజెయు నాయకులు సత్యనారాయణ, మజీద్ పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని సమాచారశాఖ కార్యాలయం ఎదుట మంగళవారం టియుడబ్ల్యుజె, హెచ్‌జెయు ఆధ్వర్యంలో నిరహార దీక్ష చేస్తున్న జర్నలిస్టులు