తెలంగాణ

బ్యాంకుల దోపిడీ.. సినిమాల్లో పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, డిసెంబర్ 22: ఐదు రాష్ట్రాల్లో బ్యాంకు దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన గజ దొంగ బాల మురుగన్ ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. ముఠాలోని మరో ఇద్దరు దినచరణ్, సురేష్ పరారీలో ఉన్నారు. బ్యాంకులను దోచుకుంటూ సినిమాల్లో పెట్టుబడి పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు బాలమురుగన్ నుంచి రూ. 70 లక్షలు నగదు, కోటి రూపాయలు విలువగల వివిధ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో మంగళవారం కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించిన వివరాలిలావున్నాయి. తమిళనాడులోని తిరువన్నూరుకు చెందిన మురగన్ అలియాస్ బాలమురగన్ కరుడుగట్టిన నేరస్తుడు. అదే ప్రాంతానికి చెందిన దినకరన్ అలియాస్ దినకర్, మురుగన్ బావమరిది సురేష్‌లతో కలసి దొంగతనాలు చేసేవారు. 2008లో నేరాలకు పాల్పడడం ప్రారంభించి దారి దోపిడీలు, బ్యాంకు దోపిడీలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడడంతో కర్నాటక పోలీసులు అరెస్టుచేశారు. 2012లో జైలునుంచి విడుదలైన తర్వాత కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మకాం మార్చారు. మహబూబ్‌నగర్ జిల్లా- బాలానగర్ గ్రామీణ బ్యాంకులో 13 లక్షల నగదు, పదిన్నర కేజీల బంగారం దోచుకున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్య పాలెంలో సప్తగిరి బ్యాంకులో 1.75 కేజీల బంగారం, 5 కేజీల వెండి- 55 లక్షల సొత్తు దోపిడీ చేశారు. 2014 సెప్టెంబర్ 8న ఘట్‌కేసర్‌లోని దక్కన్ గ్రామీణ బ్యాంకులో 35 లక్షల రూ.ల నగదు దోచుకుపోయాడు. ఈ ఏడాది హెచ్‌డిసిసి బ్యాంకు దోపిడీ సమయంలో దొరికిన ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఎట్టకేలకు మురుగన్‌ను పట్టుకున్నారు.
సినిమాలపై మోజుతో బ్యాంకు దోపిడీలు
బాల మురుగన్ నేర జీవితానికి ముందు మద్రాసులో సినిమాల్లో చేరాలని ప్రయత్నించాడు. ఓ దర్శకుడి వద్ద డ్రైవర్‌గా చేరాడు. సినిమాల్లో అవకాశం దొరక్కపోవడంతో దోపిడీలు మొదలుపెట్టాడు. మూడేళ్లకిందట సౌత్ ఇండియా ఫిలిం అసోసియేషన్‌లో తన పేరు రిజిష్టర్ చేసుకున్నాడు. బాలమురగన్ ప్రొడక్షన్ పేరుతో బావమరిది సురేష్ హీరోగా ‘మనసా వినవా’ సినిమా ప్రారంభించాడు. రాజమండ్రిలో షూటింగ్ ప్రారంభించి పోలీసు ఆఫీసర్‌తో క్లాప్ కొట్టించాడు. సినిమా పూర్తయినా రిలీజు కాలేదు. అనంతరం ‘ఆత్మ’ పేరుతో మరో సినిమా తీయడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. మురగన్ నుంచి రూ.71 లక్షల నగదు, 26 లక్షల విలువైన ఇన్నోవాకారు, 50 లక్షల విలువచేసే కిస్మత్‌పూర్‌లో ఇల్లు, 19 లక్షల విలువైన 738 గ్రా. బంగారం, అమెరికాకు చెందిన 30 డెబిట్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మురగన్ జల్సాలు చేయడంతోపాటు స్ర్తిలోలుడని ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పారు. దినకర్, సురేష్‌ల కోసం గాలిస్తున్నామన్నారు.