తెలంగాణ

వడ్డీ మాఫీ కాని రైతులను ఆథుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ రాష్ట్రంలో వడ్డీ మాఫీ కాని రైతులను ఆదుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. ఆదివారం మంత్రిని కలిసిన వీరయ్య ఒక వినతిపత్రం సమర్పించారు. శాసనసభ సమావేశాల్లో సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ కానీ , వడ్డీ మాఫీ కానీ రైతుల జాబితాను శాసనసభ స్పీకర్‌కు అందజేసినట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం, మెదక్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో గ్రామీణ వికాస బ్యాంక్ ద్వారా రుణాల రీషెడ్యూల్ వల్ల రుణ మాఫీ కాని రైతుల సమస్యలను అసెంబ్లీ వేదికగా చర్చించడం జరిగిందని తెలిపారు. మూడు నెలలు గడచినా సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఇంకా ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు ఆంధ్రప్రాంత సరిహద్దులో ఉన్న తెలంగాణ రైతాంగానికి ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు తెలంగాణలో ఉండడం వల్ల రుణ మాఫీ కాని విషయం, 1/70 ప్రాంతంలో ఉన్న రైతాంగ సమస్యలపై ప్రత్యేకంగా మాట్లాడినా ఇంతవరకు ప్రయోజనం లేదని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిష్కరించి రైతులకు మేలు చేయాలని ఆయన మంత్రి పోచారంను ఆ వినతిపత్రంలో కోరారు.