తెలంగాణ

ఏప్రిల్ 29న జింఖానా మైథానంలో గొల్ల కురుమల బహిరంగ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: ఎన్నికలు సమీపిస్తున్నందున, ప్రభుత్వ పథకాలు అమలుతో లబ్ది పొందుతున్న వారితో సభలు, సమావేశాలు నిర్వహించి ప్రచారానికి వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి భావిస్తున్నది. ఇందులో భాగంగానే గొర్రెల పంపిణీతో లాభపడిన లబ్దిదారులతో బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీనివాస్ యాదవ్ నిర్ణయించారు. ఈ ఏడాది ఏప్రిల్ 29న సాయంత్రం జింఖానా గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి తలసాని ఆదివారం గొల్ల, కురుమ కులస్తుల ముఖ్య నాయకులతో సమావేశమై చర్చించారు. కనీ, వినీ ఎరుగని విధంగా బహిరంగ సభ నిర్వహించాలని మంత్రి వారితో అన్నారు. సభ నిర్వహణ, విజయవంతం కావడానికి ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాలని ఈ సమావేశంలో భావించారు. గొల్ల, కురుమల భారీ సంఖ్యలో హాజరయ్యేందుకు ఏప్రిల్ మొదటి వారంలో తాను అన్ని జిల్లాల్లో పర్యటించి, జిల్లా గొల్ల, కురుమలను కలుసుకుంటానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా గొల్ల, కరుమలకు సంక్షేమ, వసతి భవనాల నిర్మాణం కోసం కోకాపేటలో 10 ఎకరాల స్థలం, రూ.10 కోట్ల రూపాయలు విడుదల చేసిన విషయాన్ని మంత్రి తలసాని గుర్తు చేశారు.