తెలంగాణ

స్థానిక సంస్థలను ఫైనాన్స్ కమిషన్ వల్ల బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ దోహదం చేయాలని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఆవిర్బావ పరిచయ సదస్సు ఆదివారం రవీంద్ర భారతిలో జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన రాజేశంగౌడ్, సభ్యుడు చెన్నయ్యను అతిథులు సన్మానించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల బలోపేతంలో ఆర్థిక కమిషన్ పాత్ర కీలకమైందన్నారు. ఆర్థిక కమిషన్ అంటే రుణాలు ఇచ్చే సంస్థ కాదని, ప్రభుత్వం కేటాయించిన నిధులు సద్వినియోగం జరిగేలా పర్యవేక్షిస్తుందన్నారు. స్థానిక సంస్థలు, పంచాయతీ రంగాల్లో అపారమైన అనుభవంతో పాటు గతంలో ఈ శాఖలకు మంత్రిగా పని చేసిన రాజేశంగౌడ్‌ను కమిషన్‌కు చైర్మన్‌గా నియమించడం ముఖ్యమంత్రి దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఇంతటి కీలకమైన కమిషన్‌లో చైర్మన్, సభ్యుడు రెండు పదవులను బిసీలకు ఇవ్వడం ముఖ్యమంత్రికి బిసిల పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, స్థానిక సంస్థలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు కమిషన్ కృషి చేయాలన్నారు. దేశానికే ఆదర్శంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్‌ను తీర్చిదిద్దాలన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తాము యువకులుగా ఉన్న రోజుల్లోనే రాజేశంగౌడ్ మంత్రిగా పని చేసారని గుర్తు చేసారు. కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్ మాట్లాడుతూ, తనపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానన్నారు. స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడం తన ప్రథమ కర్తవ్యమన్నారు.