తెలంగాణ

తెలంగాణ అభివృథ్ధికి సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణలో గ్రామీణాభివృద్ధికి సహకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి రాంకృపాల్ యాదవ్‌ను రాష్ట్ర గ్రామీణ, పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర గ్రామీణ, పంచాయతీరాజ్ సంస్థ (టీసీపార్డ్) లో సోమవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఇద్దరు మంత్రులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలు తెలంగాణలో అమలవుతున్న తీరుతెన్నుల పట్ల కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, 2017-18 సంవత్సరంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ఎనిమిదికోట్ల పనిదినాల లక్ష్యాన్ని అధిగమించామని, మరో ఎనిమిదికోట్ల పనిదినాలకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. 750 కోట్ల రూపాయల విలువైన మెటీరియల్ కాంపోనెంట్ చెల్లించాల్సి ఉందని, ఈ నిధులను కూడా విడుదల చేయాలని జూపల్లి కోరారు. పారిశ్రామిక రంగంలో నైపుణ్యం కలిగిన యువతకు అవకాశం కల్పించేందుకు ధీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద 2019 వరకు 47 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం లక్ష్యంగా పెట్టిందని గుర్తు చేశారు. ఈ లక్ష్యాన్ని మరింత ఎక్కువగా పెంచాలని కోరారు. 2003-04 సంవత్సరంలో జరిగిన పొరపాటు వల్ల ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రావాల్సిన 1230 కిలోమీటర్ల రహదారులు మంజూరు కాలేదని, ఈ పొరపాటు సరిదిద్ది వెంటనే రోడ్లు వేసేందుకు నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణకు రావలసిన అన్ని పథకాలు, కార్యక్రమాల గురించి ఒక వినతి పత్రాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి జూపల్లి అందచేశారు.