తెలంగాణ

2553 జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణలో వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న నార్తరన్ విద్యుత్ డిస్కాం పరిధిలో 2553 జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాల భర్తీపై ఆ సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి రెగ్యులర్ ప్రాతిపదికన దరఖాస్తులను కోరినట్లు ఆ సంస్థ సిఎండి అన్నమనేని గోపాల్‌రావు చెప్పారు. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉన్నాయన్నారు. వరంగల్‌లో 575, కరీంనగర్‌లో 674, ఖమ్మంలో 365, నిజామాబాద్‌లో 500, ఆదిలాబాద్‌లో 439 కలిపి మొత్తం 2553 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.