తెలంగాణ

మురళీకృష్ణుడైన నృసింహుడు హంసవాహనంపై విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 20: యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు మంగళవారం లక్ష్మీనరసింహుడు మురళీ కృష్ణావతారంలో హంసవాహనంపై విహరించి భక్తులను తరింపచేశారు. బాలాలయంలో ఉదయం 11 గంటలకు ఉగ్రనృసింహుడిని ముగ్ధ మనోహారుడైన గోపికాప్రియుడు మురళీకృష్ణుడిగా అలంకరించి ఇష్టపూజలు నిర్వహించి ఊరేగించారు. అనంతరం రాత్రి 9గంటలకు స్వామివారి విశేష వాహన సేవలో హంసవాహనంపై విహరించి భక్తులకు ఆధ్యాత్మిక, భక్తి జ్ఞానాదులను అనుగ్రహించి ఆశీర్వదించారు. ప్రధానార్చకులు నందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, యాజ్ఞికులు సముద్రాల శ్రీనివాసాచార్యులు, అలంకార సేవకులు ఆత్రేయచార్యులు స్వామివారి విశేషాలంకార, వాహన సేవలు నిర్వహించి భక్తులకు వాటి విశిష్టతలను వివరించారు. సేవోత్సవాల్లో ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి పాల్గొన్నారు. అర్చక పండితులు స్వామివారికి హోమాది పూజలు, వేద పారాయణాలు నిర్వహించారు.
నేడు వటపత్రాశాయిగా..
బుధవారం యాదగిరీశుడికి వటపత్రశాయి అలంకార సేవ, పొన్న వాహన సేవలు నిర్వహించనున్నారు. గురువారం నుండి ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభకానున్నాయి. ఈ కార్యక్రమాలు ఐదు రోజుల పాటు భక్తులను అలరించనున్నాయి.
chitram..
మురళీ కృష్ణావతారంలో శ్రీ లక్ష్మీనారసింహుడు