తెలంగాణ

కథా రచయిత మునిపల్లె రాజు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కథా రచయిత, సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత మునిపల్లె రాజు శనివారం కన్నుమూశారు. మూఢాచారాలకు వ్యతిరేకి, అభ్యుదయవాది, తాత్త్వికుడు అయిన మునిపల్లె గుంటూరు జిల్లా బాపట్ల తాలుకా గరికపాడు గ్రామంలో 1925లో జన్మించారు. సోషల్ రియాలిటి, సోషల్ ఫిలాసఫీ మొదలుకొని మేజిక్ రియలిజయ్ వరకు, మార్క్సిస్టు భావజాలం నుంచి మానవ జీవితాలను శాసించే సూత్రాల వరకు అన్నింటిని తన కథల్లో ప్రయోగించి మెప్పించిన ఏకైక కథా రచయత మునిపల్లె. ఆయన రచించిన పూజారి నవల ఆధారంగా బీఎన్.రెడ్డి పూజాఫలం చలనచిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆయన సాహితీ కృషికి గుర్తింపుగా పలు సాహిత్య సత్కారాలను అందుకున్నారు.