తెలంగాణ

చొరవ తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: రాజోలిబండ ఆధునీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సానుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. పాత మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు రాజోలి బండ నుంచి సాగు నీరు అందుతోంది. కాని కాలక్రమంలో పూడికలు పేరుకుపోవడం తదితర కారణాల వల్ల ఈ స్కీంను ఆధునీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రూ.72 కోట్ల నిధులను కూడా సిద్ధం చేసింది. కాని ఏపి ప్రభుత్వం ఈ విషయమై తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. రాజోలిబండ స్కీం కర్నాటకలో ఉంది. ఎడమ కాల్వ ద్వారా రాయిచూరు, మహబూబ్‌నగర్ జిల్లాలకు సాగునీరు అందుతోంది. కాగా 2013లో కుడి కాల్వకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. దీని వల్ల కర్నూలు జిల్లాలో వ్యవసాయానికి సాగునీరు అందుతుంది. ఈ స్కీం నీటి నిల్వ సామర్థ్యం 15.6 టిఎంసి ఉంటే, ఇప్పుడు 6 టిఎంసికి పడిపోయింది. 1956లో ఈ స్కీంను నిర్మించారు. ఈ స్కీం ఆధునీకరణకు కేంద్రజలసంఘం కూడా అనుమతులు ఇచ్చింది. కర్నాటక ప్రభుత్వం ఈ స్కీం ఆధునీకరణకు సమ్మతిని తెలిపింది. కాని ఆంధ్రప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా స్పందనలేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జలవనరుల శాఖ సమావేశంలో కూడా రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ఈ విషయాన్ని గట్టిగా ప్రస్తావించారు. కర్నాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వ మంత్రులు కూర్చుని మాట్లాడితే స్కీం ఆధునీకరణకు ఉన్న చిక్కులు అధిగమించవచ్చని తెలంగాణ సాగునీటి ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు.