తెలంగాణ

ఎడమ కాల్వకు నీటి నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఫిబ్రవరి 24: సాగర్ జలాశయం నుండి ఎడమ కాల్వ ద్వారా వారబందీ పద్ధతిలో విడుదల చేస్తున్న నీటిని శనివారం డ్యాం అధికారులు నిలిపివేశారు. ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు. గత వారం రోజుల నుండి నీటిని విడుదల చేసిన అధికారులు గడువు పూర్తవడంతో శనివారం ఉదయం పదిగంటల నుండి ఎడమ కాల్వకు నీటి విడుదలను క్రమేపి తగ్గిస్తు సాయంత్రం నాలుగుగంటల వరకు పూర్తిగా నిలిపి వేశారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 590 అడుగుల పూర్తిస్ధాయి నీటిమట్టానికి గాను శనివారం నాటికి 520.70 అడుగుల నీటిమట్టం ఉండగా కుడికాల్వ ద్వారా 6,263 క్యూసెక్‌ల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమకాల్వ పరిధిలో శనివారం ఉదయం 10గంటల వరకు 6,989క్యూసెక్‌ల నీటిని విడుదల చేసి సాయంత్రానికి నిలిపివేశారు. సాగర్‌లోని ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 1,739క్యూసెక్‌ల నీటిని ఎస్‌ఏల్‌బీసీ ద్వారా 1,800క్యూసెక్‌ల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుండి సాగర్ జలాశయానికి 14,888 క్యూసెక్‌ల నీరు వచ్చి చేరుకుంటుండగా శ్రీశైలంలో 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను శనివారం నాటికి 846.50 అడుగుల నీటిమట్టం ఉంది. అయితే సాగర్ జలాశయంలో 150టీఎంసీల నీరు నిల్వ ఉండగా శ్రీశైలంలో 73 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎడమకాల్వ నీటి నిలిపివేత విషయంలో డ్యాం అధికారులు మాట్లాడుతూ ఈవారం రోజుల పాటు ఎడమకాల్వ ద్వారా ఆంధ్ర ప్రాంతంలోని కృష్ణా జిల్లాకు, ఎడమకాల్వ ఆయకట్టులోని నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సగటున రోజుకు 9వేల క్యూసెక్‌ల చొప్పున 5.8 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. మరో వారం రోజుల తరువాత ఎడమకాల్వ నీటివిడుదలను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.