తెలంగాణ

పాతాళానికి భూగర్భ జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భూగర్భ జలాలను అడ్డూ అదుపు లేకుండా తోడడం వల్ల, యథేచ్ఛగా వాడడంతో రీచార్జీ చేసేందుకు కేంద్రం ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. దేశంలో మొత్తం భూగర్భ జలాలకు సంబంధించి 6584 బ్లాక్‌లు ఉన్నట్లు కేద్ర భూగర్భ జల బోర్డు గుర్తించింది. ఇందులో 1034 బ్లాక్‌లు నీరు పాతాళానికి వెళ్లాయి. వీటిని రీచార్జీ చేసి భూగర్భ జలాలతో కళకళలాడేందుకు వీలుగా రూ.6వేల కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. దీనికి ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 6వేల కోట్ల ఆర్థిక సహాయం తీసుకోనున్నారు. ఈ స్కీంకు అటల్ భూజల్ యోజన స్కీం అని నామకరణం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ స్కీంను అమలు పరచాలని, దీనికి రాష్ట్రప్రభుత్వాలు సహకారం కావాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరింది. మొత్తం రూ.6వేల కోట్ల నిధుల్లో ప్రపంచ బ్యాంకు రూ.3వేల కోట్లను ఆర్థికసహాయాన్ని అందించనుంది. ఈ స్కీంనను ఏప్రిల్ 1 నుంచి లాంచనంగా దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. స్థానికంగా ప్రజల భాగస్వామ్యంతోనే భూగర్భ జలాల రీచార్జీ స్కీంను అమలు చేస్తామని కేంద్రం తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రప్రభుత్వాలకు రాసిన లేఖలో పేర్కొంది. దేశంలో 6534 భూగర్భ జలాల బ్లాక్‌లు ఉన్నాయి. ఇందులో 4520 బ్లాక్‌లు సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర భూగర్భ జలాల బోర్డు గుర్తించింది. క్లిష్ట పరిస్థితిలో 253 బ్లాక్‌లు, ఎక్కువగా వాడిన భూగర్భ జలాల బ్లాక్‌లు 1034, ఉప్పునీటి మయమైన బ్లాక్‌లు 96 ఉన్నాయి. భూగర్భ జలాలు రీచార్జీ అయ్యేదాని కంటే ఎక్కువగా నీటిని తోడుతున్న బ్లాక్‌లను ఓవర్ ఎక్స్‌ప్లాయిట్ విభాగంలో ఉంచారు. భారతదేశంలో భూగర్భ జలాలు 411 బిలియన్ క్యూబిక్ మీటర్లు నీరు లభ్యత ఉంది. హర్యానా, ఢిల్లీ, పశ్చిమ యుపి, రాజస్తాన్, గుజరాత్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా భూగర్భ జలాలను తోడుతున్నారు. ఇందులో పంజాబ్, హర్యానా, రాజస్తాన్, ఢిల్లీలో భూగర్భ జలాల పరిస్థితి అధ్వాన్న స్థితికి చేరుకుంది. 1139 బ్లాక్‌ల్లో తమిళనాడులో 358 బ్లాక్‌లు ఉన్నాయి.