తెలంగాణ

నేడు ప్రిన్స్ కరీం ఆగాఖాన్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ప్రిన్స్ కరీం ఆగా ఖాన్ ఈ నెల 26 నుంచి 28 వరకు జరగనున్న నగర పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వివి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నాం 2.24 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఖాన్ హోటల్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత రోజు 27వ తేదీ ఉదయం 10.05 గంటల నుంచి 11.10 వరకు రాజ్‌భవన్‌కు వెళతారు. అనంతరం 11.15 గంటలకు బయలుదేరి 12.20 గంటలకు తిరిగి తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు. అదే రోజు మధ్యాహ్నాం 3.10కి ప్యాలెస్ నుంచి బయలుదేరి నిజాం కాలేజీకి చేరుకుంటారు. తిరిగి 5.45 గంటలకు నిజాం కాలేజీ నుంచి బయలుదేరి తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారని నగర పోలీసు కమిషనర్ తెలిపారు. 28వ తేదీ ఉదయం 9.55 గంటలకు తాజ్‌ఫలక్‌నుమా ప్యాలెస్ నుంచి నిజాం కాలేజీకి విచ్చేస్తారు. మధ్యాహ్నాం 12.15 గంటలకు నిజాం కాలేజీ నుంచి బయలుదేరి 1.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి విచ్చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా రూట్లలో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రజలు సహకరించాలని సిపి విజ్ఞప్తి చేశారు. ఎఆర్ పెట్రోల్ పంప్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బిజెఆర్ విగ్రహం వైపునకు కాకుండా నాంపల్లి వైపునకు మళ్లిస్తారు. గన్‌ఫౌండ్రీ, అబిడ్స్ వైపునుంచి వచ్చే ట్రాఫిక్‌ను బిజెఆర్ విగ్రహం వైపునకు కాకుండా చాపెల్ రోడ్ మీదుగా, బషీర్‌బాగ్ నుంచి అబిడ్స్ జిపివో వైపునకు వచ్చే ట్రాఫిక్‌ను బషీర్‌బాగ్ నుంచే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా కింగ్‌కోఠి రోడ్డు మీదుగా, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు నుంచి బషీర్‌బాగ్ వైపునకు వచ్చే ట్రాఫిక్‌ను హిమయత్‌నగర్ వై జంక్షన్ గుండా మళ్లిస్తారని సిపి తెలిపారు. లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వచ్చే ట్రాఫిక్‌ను లిబర్టీ వద్ద నుంచే హిమయత్‌నగర్ వైపునకు మళ్లిస్తారని, ట్రాఫిక్ కంట్రోల్ రూం నుంచి బషీర్‌బాగ్ వచ్చే ట్రాఫిక్‌ను బషీర్‌బాగ్ నుంచి లిబర్టీ వైపునకు మళ్లిస్తారని, కింగ్‌కోఠి వైపు నుంచి బషీర్‌బాగ్ వైపునకు వచ్చే ట్రాఫిక్‌ను కింగ్‌కోఠి జంక్షన్ వద్ద ఉన్న సెమెటరీ వైపునకు మళ్లిస్తారని సిపి వెల్లడించారు. ప్రజలు ఈ ఆంక్షలను గమనించి తమ తమ గమ్య స్ధానాలకు చేరుకోవాలని సిపి సూచించారు.