తెలంగాణ

విద్యుత్ కొరత ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: వచ్చే మూడేళ్లలో తెలంగాణ రాష్ట్రం విద్యుత్ కెపాసిటీ 17500 మెగావాట్లకు చేరుకుంటుంది. దీని వల్ల ఆ మేర విద్యుత్ డిమాండ్ వచ్చినా విద్యుత్‌కు ఎటువంటి కొరత ఉండదు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత తొలిసారిగా శనివారం విద్యుత్ డిమాండ్ 10002 మెగావాట్ల దాటిం ది. వచ్చే మూడు నెలల్లో విద్యుత్ డిమాండ్ 15వేల మెగావాట్లు వచ్చినా ఎదుర్కొనేందుకు వీలుగా డిస్కాంలు ముందస్తుగా పూర్తి ఏర్పాట్లు చేశాయని, విద్యుత్ పుష్కలంగా అందుబాటులో ఉందని సదరన్ డిస్కాం సిఎండి జి రఘుమారెడ్డి, నార్తరన్ డిస్కాం సిఎండి గోపాలరావు ప్రకటించారు. 24వ్యవసాయ విద్యుత్‌కు, పరిశ్రమలకు, గృహ వినియోగదారులకు కోతలకు తావులేకుండా, అవాంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని వారు తెలిపారు. విద్యుత్ కొరత లేదని వారు స్పష్టం చేశారు. వారు ఇక్కడ విద్యుత్ సమీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది ఇంతవరకు అన్ని రకాల పద్దులు కలిపి రూ.7585 కోట్ల నిధులను విడుదల చేసి విద్యుత్ అభివృద్ధికి వెనుదన్నుగా నిలబడిందన్నారు. రెండు డిస్కాంలకు కలిపి రూ. 310 కోట్ల అదనపు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించింది. రెండు డిస్కాంలకు సంబంధించి రూ.8900 కోట్ల భారాన్ని ఉదయ్ స్కీం ద్వారా రాష్ట్రప్రభుత్వం స్వీకరించింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా విధానంపై అడిగి తెలుసుకుంటున్నాయని, ఈ విషయమై తాము అన్ని సాంకేతిక వివరాలు అందించామన్నారు. జనవరి 1వ తేదీ నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ స్కీంను ప్రారంభించగా, ఇంతవరకు 50 రోజుల్లో ఎటువంటి అవాంతరం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేశారు.
వచ్చే మూడు నెలల్లో విద్యుత్ కెపాసిటీ 17వేల 500మెగావాట్లకు చేరుకుంటుందన్నారు. చత్తీస్‌గడ్ నుంచి వెయ్యి మెగావాట్లుల, కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి రెండు వేల మెగావాట్లు సింగరేణి నుంచి పిపిపి విధానం ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉందన్నారు. రాష్ట్రప్రభుతవ్గత రెండేళ్లుగా విద్యుత్ సరఫరా, పంపిణీకి రూ.12100 కోట్లను ఖర్చుపెట్టిందన్నారు. దీని వల్ల విద్యుత్ సాంకేతిక నష్టాలు గణనీయంగా తగ్గాయన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దార్శనికత వల్ల దేశంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ ముందంజలో నిలిచిందన్నారు. ప్రస్తుతం 3200 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. 2014లో తెలంగాణ అవతరించినప్పుడు 2700 మెగావాట్ల విద్యుత్ కొరత ఉండేదని, మూడున్నరేళ్లలో ముందు చూపు వల్ల పెద్ద ఎత్తున విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పామన్నారు. రాష్ట్రప్రభుత్వం సబ్సిడీ కింద 2016-17లో రూ.4584 కోట్లు, 2017-18లో రూ.4777 కోట్లను సబ్సిడీ కింద లభించింది. 2017-18లో ఇంతవరకు రాష్ట్రప్రభుత్వం నుంచి రూ 7585 కోట్ల నిధులు విద్యుత్ సంస్థలకు వచ్చాయన్నారు. 400 కెవి సబ్ స్టేషన్లు 17, 220 కెవి సబ్ స్టేషన్లు 35, 132 కెవి సబ్‌స్టేషన్లు 92, 33 కెవి సబ్‌స్టేషన్లు 937 నెలకొల్పామన్నారు. ఇంకా 33/11 కెవి సబ్‌స్టేషన్లు 2728, డి ట్రాన్స్‌ఫార్మర్లను 6.3 లక్షలను ఏర్పాటు చేశామన్నారు. దీని వల్ల విద్యుత్ బ్రేక్‌డౌన్ సమస్యలు తలెత్తడం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయని, సాలీనా ఒక లక్ష విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. తెలంగాణ విద్యుత్ రంగంలో సాధిస్తున్న ప్రగతిని చూసి కేంద్ర గ్రామీణ విద్యుత్ సంస్థ వడ్డీని 9.65 శాతానికి తగ్గించిందన్నరు.