తెలంగాణ

‘రియల్‌‘పై అధ్యయనానికి నిపుణుల కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ చట్టం (ఆర్‌ఇఆర్‌ఎ) లో మార్పులు చేర్పులు చేసేందుకు ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించారు. పురపాలక వ్యవహారాల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. జిహెచ్‌ఎంసి చీఫ్ సిటీ ప్లానర్ ఎస్. దేవేందర్‌రెడ్డి, డైరెక్టర్ ప్లానింగ్ ఎస్. బాలకృష్ణ, డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కె. విద్యాసాగర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ కర్నాటక, మహారాష్టల్ల్రో పర్యటించి ఆ యా రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ చట్టాలు ఏ విధంగా ఉన్నాయో అధ్యయనం చేస్తారు. కేంద్ర అధికారులతో కూడా ఈ కమిటీ సమావేశమై చర్చిస్తుంది. మన రాష్ట్రంలో ఉన్న చట్టంలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందేమో పరిశీలన చేస్తారు. ఈ కమిటీ పదిహేను రోజుల్లోగా నివేదిక సమర్పించాలని అరవింద్ కుమార్ ఆదేశించారు.